హీరో రానా కెరియర్లో కీలకమైన చిత్రం లీడర్. ఈ సినిమా  సీక్వెల్ ఉంటుందనే చర్చ ఎప్పుడో విడుదలైన ఈ సినిమాకి కూడా మొదలవుతూనే ఉంది .డైరెక్టర్ శేఖర్ కమ్ముల రానాని హీరోగా పరిచయం చేసినప్పటి నుంచే ఈ మాట వినిపిస్తూ ఉన్న ఇప్పటివరకు ఇందుకు సంబంధించి ఏ విషయం ముందుకు వెళ్లడం లేదు. ఇందులో హీరోయిన్గా రీఛా గంగోపాధ్యాయ, ప్రియా ఆనంద్ వంటి వారు నటించారు. సమకాలిన రాజకీయాలు ఎలా ఉన్నాయి.. సామాన్యులకి ఎంత మేలు చేస్తాయి? రాజకీయ చదరంగంలో ఎవరు ఎలా ఉంటారు.. పరిస్థితులను బట్టి ఎలా తప్పుకుంటారనే విషయాన్ని చాలా క్లియర్ కట్ గా చూపించారు.


ఆలోచింపజేసే కథ కథనాలతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించి 2010 లో విడుదలై సరి కొత్త సెన్సేషనల్ క్రియేట్ చేసింది. సుమారుగా ఈ సినిమా విడుదలై ఇప్పటికి 15 సంవత్సరాలు కావోస్తువున్న ఈ సినిమా సీక్వెల్ పైన శేఖర్ కమ్ముల స్పందించలేదు. కానీ చాలా వరకు ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకుల చాలా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు శేఖర్ కమ్ముల ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటించలేదు.


గతంలో రజినీకాంత్ రాజకీయాలలోకి వస్తున్నారని వార్తలు వినిపించినప్పుడు లీడర్ 2 సినిమా రజనీకాంత్ తో తీస్తారనే విధంగా వార్తలు వినిపించాయి. అయితే మళ్లీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు తాజాగా ఈ విషయం వైరల్ గా మారడంతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల లీడర్ 2 పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ధనుష్ నటించిన కుబేర సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా లీడర్ సీక్వెల్  గురించి మాట్లాడారు.. లీడర్ 2 కి సంబంధించిన అన్ని స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సరిగ్గా సరిపోతుందా లేదా అనే అనుమానం తనలో ఉందని.. ప్రస్తుతం ఉన్న రాజకీయా నాయకులను సైతం మించిపోయి మరి ప్రజలు మారిపోయారని ఇలాంటి సమయాలలోనే లీడర్ 2 సినిమా కథ హిట్ అవుతుందా లేదా అనుమానం తనలో ఉందని వెల్లడించారు.. లీడర్ 2 కథ సిద్ధంగా ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయాలకు స్టోరీ సరిపోతుందో లేదో అన్నట్టుగా హింట్ ఇచ్చారు శేఖర్ కమ్ముల.

మరింత సమాచారం తెలుసుకోండి: