గత కొన్ని సంవత్సరాలుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లలో సినిమాలు చూడడానికి మన భారతీయులు ఎక్కువ ఆసక్తిని చూపుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. దానితో కొన్ని బాగున్న సినిమాలకు కూడా థియేటర్లలో కలెక్షన్లు పెద్ద స్థాయిలో రావడం లేదు. ఆ తరువాత ఆ సినిమాలకు ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లలో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తూ వస్తుంది. దానితో కొన్ని సినిమాలు థియేటర్లలో భారీ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాలను అందుకోకపోయినా ఓ టీ టీ లో మాత్రం భారీ విజయాలను సాధించిన సినిమాల స్థాయి రెస్పాన్స్ ను దక్కించుకుంటున్నాయి.

ఇకపోతే కొంత కాలం క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 2" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... సుకుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ గత కొంత కాలంగా నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కి 2025 వ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో ఇప్పటివరకు 9.4 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇకపోతే కొంత కాలం క్రితం హిందీ నటుడు సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో జాట్ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. 

సినిమా తాజాగా నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ సంవత్సరంలో ఈ సినిమా ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో 7.9 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. దానితో ఈ సినిమా ఏకంగా పుష్ప పార్ట్ 2 మూవీ దరిదాపుల్లోకి వచ్చేసింది. దానితో జాట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కంటే కూడా ఓ టీ టీ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa