టాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినా వాటి ద్వారా ఈయనకు పెద్ద స్థాయిలో గుర్తింపు రాలేదు. అలాంటి సమయంలో ఈయన డీజే టిల్లు అనే పక్కా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఈ సినిమాలోని సిద్దు డైలాగ్ డెలివరీ , బాడీ లాంగ్వేజ్ , డ్రెస్సింగ్ స్టైల్ అన్ని ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా సిద్దు కు అద్భుతమైన గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత ఈయన డీజే టిల్లు మూవీ కి కొనసాగింపుగా రూపొందిన టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. దీనితో ఒక్క సారిగా సిద్దు క్రేజ్ పెరిగిపోయింది. ఇలా వరుసగా రెండు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న తర్వాత సిద్దు , బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన జాక్ అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మాత్రం బాక్సా ఫీస్ దగ్గర భారీ అపజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సిద్దు "తెలుసు కదా" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రాశి కన్నా , శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. 

ఇకపోతే తాజాగా ఈ మూవీ షూటింగ్ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క లాస్ట్ షెడ్యూల్ తాజాగా హైదరాబాదులో స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. ఓ వైపు ఈ సినిమాకు సంబంధించిన లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుండగా , మరో వైపు ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా తెలుసు కదా మూవీ పనులు అత్యంత వేగంగా పూర్తి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: