సోషల్ మీడియాలో పాజిటివిటీ కన్నా నెగిటివిటీనే ఎక్కువగా చూడాల్సి వస్తుంది . ఒక మంచి పని చేసిన సరే దాన్ని నెగిటివ్గా చూడడం అలవాటుగా మారిపోయింది ఈ మధ్యకాలంలో కొంతమంది జనాలకి .మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో హీరోయిన్ సాయి పల్లవిని దారుణతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . ఆమె చేసిన తప్పేమీ లేదు . కేవలం తన ఫేవరెట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది.


దీనిని పెద్ద రాద్ధ్హంతం చేస్తూ తప్పు పడుతున్నారు కొంతమంది ఆకతాయిలు.  సాయి పల్లవి పై నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు . హీరోయిన్ సాయి పల్లవి పై ఎప్పుడూ కూడా ఈ విధమైనటువంటి నెగిటివిటీ వచ్చిందే లేదు .శేఖర్ కమ్ముల సినిమాకి ఆమె పాజిటివ్ రివ్యూ ఇవ్వడం పట్ల జనాలు పాజిటివ్ గానే ఉన్న ఈ రేంజ్ లో శేఖర్ కమ్ములని పొగడడం ఏంటి ..? అంటూ కావాలనే టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . మన అందరికీ తెలిసిందే కుబేర సినిమా కొద్దిసేపటి  క్రితమే రిలీజ్ అయ్యింది.



సినిమా మంచి పాజిటివ్ టాక్ అందుకుంది . మరి ముఖ్యంగా నాగర్జున - ధనుష్ - రష్మిక మందన్నా ల  పెర్ఫార్మన్స్  వేరే లెవల్ . అందరు అదే మాట అంటున్నారు . సినిమాకి వస్తున్న పాజిటివ్ టాక్ పట్ల పలువురు స్టార్ సెలబ్రిటీస్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ ని మెచ్చుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే హీరోయిన్ సాయి పల్లవి .. శేఖర్ కమ్ములని మెచ్చుకుంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేసింది . సాయి పల్లవి ఎక్కడ కూడా నెగిటివ్గా మాట్లాడనే లేదు . సాయి పల్లవి చాలా సాఫ్ట్ మ్యానర్లోనే ట్వీట్ చేసింది . కానీ కొంతమంది మాత్రం కుబేర సినిమా హిట్ అవ్వడం పట్ల రష్మిక మందన్నా కన్నా నువ్వే హ్యాపీగా ఉన్నట్లున్నావ్ అంటూ కావాలని ట్రోల్ చేస్తున్నారు . శేఖర్ కమ్ముల ను ఓ  రేంజ్ లో పొగిడేసిన సాయి పల్లవి అంటూ కిండల్ గా ఆమెకు ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు . కాగా నిజానికి కుబేర సినిమాలో సాయి పల్లవిని  హీరోయిన్గా అనుకున్నారట శేఖర్ కమ్ముల.  కానీ బ్యాక్ టు బ్యాక్ ఆమెతోనే సినిమాలు తీస్తే బాగోదు అన్న కారణంగానే ఆయన వెనక అడుగు వేశారట.  అప్పట్లో ఈ వార్త బాగా వైరల్ అయ్యింది . మొత్తానికి కుబేర సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్లాస్ట్ చేసేస్తుంది అనడంలో నో డౌట్. మొదటి రోజు ఏ విధంగా కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుందో తెలియాలి అంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే..!




మరింత సమాచారం తెలుసుకోండి: