
అయితే రవితేజ మాత్రం సినిమా వాయిదా విషయంలో ఆసక్తిగా లేరని తెలుస్తోంది. తెలిసిన సమాచారం ప్రకారం జులై 25 లేదా ఆగస్టు నెల ఒకటో తేదీన కింగ్డమ్ మూవీ థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. హీరో విజయ్ దేవరకొండకు ఈ సినిమా సక్సెస్ సాధించడం ఎంతో కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గౌతం తిన్న నూరి ఈ సినిమా కోసం అద్భుతమైన కథ సిద్ధం చేశారని ఆ కథ తెరపై మరింత అద్భుతంగా కనిపిస్తుందని తెలుస్తోంది.
పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా విడుదల కానుండగా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. మాస్ జాతర మూవీ మాస్ ప్రేక్షకులకు విందు భోజనంలా ఉండబోతుందని తెలుస్తోంది. రవితేజ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్నారు. రవితేజ మరో సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదలవుతున్న నేపథ్యంలో కచ్చితంగా ఆగస్టు నెలలో విడుదల చేయాలని రవితేజ కోరినట్టు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో రవితేజ సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగలగా ఈ సినిమాతో ఆ సెంటిమెంట్ సైతం బ్రేక్ అవుతుందేమో చూడాల్సి ఉంది. విజయ్ దేవరకొండ కింగ్ డం మూవీ ఇప్పటికే పలు రిలీజ్ గేట్లను మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంచలన రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.