మెగా డాటర్ నిహారిక గురించి కొత్తగా, ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబర్ గా, యాంకర్ గా, ప్రొడ్యూసర్ గా, నటిగా నిహారిక సత్తా చాటారు. నిహారిక తన భర్తతో విడిపోవడం వెనుక అభిమానుల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఏ కారణం వల్ల నిహారిక ఆమె భర్తతో విడిపోయారో కూడా క్లారిటీ లేదు. అయితే నిహారిక ఆమె భర్తతో విడిపోవడం గురించి, నిహారిక రెండో పెళ్లి గురించి నాగబాబు క్లారిటీ ఇవ్వగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

నిహారిక నేను ఎక్కువగా మాట్లాడుకుంటామని  పిల్లల కెరీర్ విషయాల్లో తలదూర్చనని   నాగబాబు తెలిపారు.  నా పిల్లల హిట్స్ ఫ్లాప్స్ గురించి నాకవసరం లేదని నాగబాబు తెలిపారు.  వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అని ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చారు.  సంతోషంగా ఉంటే  అదే నాకు తృప్తి అని ఆయన చెప్పుకొచ్చారు.  వాళ్ళు ఆనందంగా లేకపోతె   ఎన్ని కోట్లు ఉన్న వృథానే అని ఆయన తెలిపారు.

 వరుణ్ లావణ్యను పెళ్లి చేసుకుంటానని  నా దగ్గరకు వఛ్చి అడిగిన సమయంలో  ఆమెతో నువ్వు సంతోషంగా ఉంటావా?  భవిష్యత్తులో  ఎలాంటి సమస్యలు రావు కదా?  అన్నానని నాగబాబు తెలిపారు.  హ్యాపీగా ఉంటామని  వరుణ్ తేజ్ బదులిచ్చారని నాగబాబు  చెప్పుకొచ్చారు.  సరేనని పెళ్లి జరిపించమని  వాళ్ళ జడ్జిమెంట్ కరెక్ట్ అయ్యి వాళ్ళు సంతోషంగా ఉన్నారని నాగబాబు కామెంట్లు చేశారు.

నిహారిక విషయంలో మాత్రం మా జడ్జిమెంట్ తప్పయిందని  ఆ పెళ్లి మేము చేసిన తప్పు అని  నాగబాబు వెల్లడించారు.  మేము సరిగ్గా  జడ్జ్ చేయలేకపోయామని ఆలా అని తనకు ఇష్టం లేని పెళ్లి జరిపించలేదని  నాగబాబు పేర్కొన్నారు. తను సంబంధం ఓకే అన్నాకే  ముందుకు వెళ్లామని  నాగబాబు అన్నారు.  ఇద్దరికీ సింక్ కాలేదని పరస్పర అంగీకారంతో విడిపోయారని ఆయన చెప్పుకొచ్చారు.  కొంతకాలం తర్వాత నిహారిక  మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటుందంటూ ఆయన కామెంట్లు చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: