డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గత కొద్ది రోజుల నుంచి విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు మరియు మోహన్ బాబు ఒకవైపు నిలబడగా.. మంచు మనోజ్ ఒక్కడే ఒకవైపు ఉండి ఫైట్ చేస్తున్నాడు. ఇటువంటి టైం లో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప విడుదలకు సిద్ధమైంది. మోహన్ బాబు నిర్మించి నటించిన ఈ చిత్రంలో విష్ణు టైటిల్ రోల్‌ను పోషించ‌గా.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో స్టార్స్ కూడా భాగం అయ్యారు.

దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న కన్నప్ప రేపు గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే తాజాగా చిత్ర బృందానికి విషెస్ చెబుతూ మంచు మనోజ్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. `కన్నప్ప టీం కి శుభాకాంక్షలు! నాన్నగారు మరియు ఆయన బృందం ఈ సినిమా కోసం చాలా సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించాలని నేను ప్రార్థిస్తున్నాను. నా చిన్న చాంప్స్ ఆరి, వివి, మరియు అవ్రామ్(మంచు విష్ణు పిల్ల‌లు)లు బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు నేను ఆస‌క్తిగా ఉన్నాను

తనికెళ్ల భరణి గారి జీవితకాల స్వప్నం రేపు సాకారం కాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. గోల్డెన్ హార్ట్ క‌లిగిన ప్రబాస్ గారు,  గాడ్ ఆఫ్ ది గాడ్స్ మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, ప్రభుదేవా గారు, మరియు ఈ సినిమాని ప్రేమ మరియు నమ్మకంతో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరంద‌ర్నీ వెండితెరపై ప్రకాశించడం చూడటానికి ఇంకా వేచి ఉండలేను. శివుడు ఈ ప్రయాణాన్ని కాంతి, ప్రేమ మరియు వారసత్వంతో ఆశీర్వదిస్తాడు.` అంటూ మ‌నోజ్ సుధీర్గ పోస్ట్ పెట్టారు. కానీ, మంచు విష్ణు పేరును మాత్రం ప్ర‌స్తావించ‌లేదు. అయిన కూడా `నువ్వు గ్రేట్ సామి` అంటూ మ‌నోజ్‌ను నెటిజ‌న్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అన్న‌తో ఎన్ని విభేదాలు ఉన్న అత‌ని సినిమా హిట్ అవ్వాల‌ని ఆకాంక్షిస్తూ పోస్ట్ పెట్ట‌డంతో మ‌నోజ్ మ‌రో మెట్టు ఎక్కేశాడ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: