తాజాగా ప్యాస్టెల్ బ్లూ కలర్ ట్రెండీ లెహంగాలో సొగసుల వల విసిరింది. తన నాజూకు అందాలతో డ్రెస్ కు మరింత అందాన్ని జోడించింది. ఏజ్ 40 అయిన స్వీట్ 16లా శ్రియా మిస్మరైజ్ చేయడంతో కుర్రకారు చూపు తిప్పుకోలేకపోతున్నారు. 
ఏముందిరా బాబు.. ఒక బిడ్డకు తల్లంటే నమ్మగలమా అంటూ నెటిజన్లు శ్రియా గ్లామర్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దీంతో శ్రియా లేటెస్ట్ ఫోటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.
కాగా, టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన శ్రియా.. అనతి కాలంలోనే భారీ స్టార్డమ్ సంపాదించుకుంది. తెలుగులో ఆల్మోస్ట్ టాప్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది.
2018లో శ్రియా తన రష్యన్ ప్రియుడు ఆండ్రీ కోస్చీవ్‌ను గప్‌చుప్‌గా కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంది. 2021లో ఈ జంటకు రాధా శరణ్ కోస్చీవ్ అనే కుమార్తె జన్మించింది. అవకాశాలు రాకో ఏమో కానీ బిడ్డ పుట్టాక శ్రియా బిగ్ స్క్రీన్ పై కనిపించడం తగ్గించేసింది. ప్రస్తుతం శ్రియా చేతిలో ఎటువంటి ప్రాజెక్ట్స్ లేవు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి