
వారం మొత్తం వర్క్ లైఫ్ తో బిజీగా ఉన్నా వీకెండ్ లో మాత్రం పర్సనల్ లైఫ్ స్పెండ్ చేస్తామని చెప్పారు. ఒక విషయంలో మాత్రం కచ్చితమైన నియమాన్ని పాటిస్తానని చైతన్య వెల్లడించారు. వర్క్ లైఫ్ వల్ల మేమిద్దరం కలిసి టైం స్పెండ్ చేయడానికి అంతగా వీలు పడదని చైతన్య అన్నారు. క్వాలిటీ టైం ను స్పెండ్ చేయడానికి అనుబంధాన్ని పెంచుకోవడం కోసం మేమిద్దరం కొన్ని రూల్స్ పాటిస్తామని చైతన్య చెప్పుకొచ్చారు.
మేమిద్దరం హైదరాబాద్ లో ఉంటే ఉదయం, సాయంత్రం సమయాలలో కలిసే భోజనం చేయాలనీ నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చారు. ఆదివారాలలో నాకు నచ్చ్చిన విధంగా ఉంటామని మూవీ నైట్, షికారుకు వెళ్లడం, నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, కుక్ చేసుకోవడం ఇలా ఆ క్షణాలను ప్రత్యేకంగా మధుర జ్ఞాపకంగా మార్చుకుంటామని నాగచైతన్య తెలిపారు.
తనకు పుస్తకాలూ చదవడం అంటే ఇష్టమని రేసింగ్ పై ఆసక్తి ఉందని ఇద్దరం కలిసి హాలిడే ప్లాన్స్ చేస్తామని ఇటీవల తనకు రేస్ ట్రాక్ పై డ్రైవింగ్ నేర్పించానని తాను ఎంతో సంతోషించిందని ఎంజాయ్ చేసిందని చైతన్య అన్నారు. తానూ రతన్ టాటాను ఎంతో అభిమానిస్తాన్ని నాగచైతన్య అన్నారు. రతన్ టాటాన ఒక సుపూర్తి ప్రదాతగా భావిస్తానని ఆయన కామెంట్లు చేశారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు