టాలీవుడ్ నటులలో ఒకరు అయినటువంటి మంచు విష్ణు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన తన కెరియర్ లో చాలా సినిమాల్లో నటించాడు. కానీ ఈయనకు ఆ సినిమాల్లో చాలా తక్కువ సినిమాలతోనే మంచి విజయాలు దక్కాయి. కొంత కాలం క్రితం విష్ణు  "జిన్నా" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావాన్ని కూడా చూపలేకపోయింది. ఈ మూవీ తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్న విష్ణు తాజాగా కన్నప్ప అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మూవీ లో రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్, మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమాకు ఇప్పటివరకు మంచి కలెక్షన్లు బాక్సా ఫీస్ దగ్గర తగ్గుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ గురించి సీనియర్ స్టార్ రైటర్ అయినటువంటి పరుచూరి గోపాలకృష్ణ స్పందించాడు. తాజాగా పరుచూరి గోపాలకృష్ణ "కన్నప్ప" సినిమా గురించి స్పందిస్తూ... కన్నప్ప సినిమాతో విష్ణు చాలా పెద్ద సాహసం చేశాడు అని గోపాలకృష్ణ పేర్కొన్నారు. 

ఇప్పటికే తెలిసిన కథను ప్రేక్షకులను మళ్లీ అందించాలి అనుకోవడం పెద్ద సాహసం అనే ఆయన చెప్పారు. ఈ మూవీ లో మోహన్ బాబు అద్భుతంగా నటించారు అని ఆయన చెప్పుకొచ్చారు. కన్నప్ప కు ప్రభాస్ ఎంత గానో అండగా నిలిచారు అని, ఇలాంటి పాత్రలు చేయడం ఆయన గొప్పతనం అని పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు. మోహన్ బాబు నమ్మకాన్ని మంచు విష్ణు నిలబెట్టుకున్నాడు అని కూడా ఆయన చెప్పారు. ఇలా స్టార్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ "కన్నప్ప" మూవీ గురించి తాజాగా స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

pgk