నట‌సింహం నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఏపీ పాలిటిక్స్ లో సూపర్ యాక్టివ్ గా ఉన్నారు. అధికార కూటమిలో భాగమై ఉన్న పవన్ కళ్యాణ్, బాలయ్య బాక్సాఫీస్ ఫైట్ కు రెడీ అవ్వడంతో అందరి చూపు సెప్టెంబర్ 25 పైనే పడింది. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ 2` మూవీ చేస్తున్నారు. బాలయ్య కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిన అఖండ మూవీకి సీక్వెల్ ఇది. సంయుక్త కథానాయిక కాగా.. ఆది పినిశెట్టి విల‌న్ గా చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.


అఖండ 2 మూవీని దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించింది. అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న `ఓజీ` మూవీ మేకర్స్ కూడా అదే డేట్ పై కన్నేశారు. `సాహో` ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఓజీ మూవీని డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్‌. ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్ప‌టినుంచో ఎగ్సైజ్ చేస్తు ఓజీ సెప్టెంబ‌ర్ 25న రిలీజ్ కానుంద‌ని యూనిట్ అనౌన్స్ చేసింది.


కానీ ఒకేరోజు అఖండ 2, ఓజీ చిత్రాలు వ‌స్తే థియేట‌ర్స్ విష‌యంలో బిగ్ క్లాష్ ఏర్ప‌డింది. ఇది క‌లెక్ష‌న్స్ ను తీవ్ర ప్ర‌భావితం చేస్తుంది. సో.. ఏదో ఒక సినిమా వెన‌క్కి త‌గ్గాల్సిందే. మొన్న‌టి వ‌ర‌కు ఓజీ రిలీజ్ డేట్ వాయిదా ప‌డుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగ‌డంతో.. రూమర్స్ నమ్మకంటి విడుద‌ల తేదీలో ఎటువంటి మార్పు ఉండ‌ద‌ని మేక‌ర్స్ స్ప‌ష్టం చేశారు.


అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ప‌వ‌న్ కోసం బాల‌య్యే బ్యాక్ స్టెప్ వేస్తున్నార‌ట‌. ఓజీ సినిమాపై ఉన్న హైప్, ఫ్యాన్స్‌లో నెలకొన్న క్రేజ్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని అఖండ 2 మూవీని వారం రోజులు వాయిదా వేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. వీకెండ్ క‌లిసొచ్చేలా ద‌స‌రా పండుగ రోజు అక్టోబ‌ర్ 2న మూవీని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు బ‌లంగా టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: