
వీరసింహారెడ్డి సినిమాకు వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు వారసుడు సినిమాతో పోటీ ఎదురైంది. వీరసింహారెడ్డి సినిమాకు పోటీ లేకపోతే ఈ సినిమా రిజల్ట్ మరింత బెటర్ గా ఉండేదని చెప్పవచ్చు. బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాకు విజయ్ నటించిన లియో సినిమాతో పోటీ ఎదురైంది. భగవంత్ కేసరి సినిమా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావించినా అందుకు భిన్నంగా జరిగింది.
ఈ ఏడాది డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పోటీ ఎదురు కావడం వల్ల ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు అయితే రాలేదు. డాకు మహారాజ్ సినిమా 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావించినా అందుకు భిన్నంగా జరిగింది.
బాలయ్య పారితోషికం కూడా ఒకింత భారీ స్థాయిలో ఉంది. అఖండ2 సినిమాకు పోటీగా ఓజీ సినిమా విడుదల అవుతుండగా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. అఖండ2 సినిమాకు బాక్సాఫీస్ వద్ద పోటీ ఉంటుందో లేదో రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది. అఖండ2 సినిమా కమర్షియల్ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు