టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ , నాగార్జున గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరు నలుగురు కూడా ఎన్నో విజయాలను అందుకొని ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగించడం మాత్రమే కాకుండా ఇప్పటికి కూడా అద్భుతమైన జోష్ లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు. వీరు నలుగురు నటించిన ఎన్నో సినిమాలు సంక్రాంతి పండక్కు విడుదల అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి.

చాలా సందర్భాలలో సంక్రాంతి పండక్కు చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ మూవీలు విడుదల అయిన సందర్భంలో నాగార్జున మాత్రం పోటీకి రాలేదు. 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు , బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహ నాయుడు , వెంకటేష్ హీరోగా రూపొందిన దేవిపుత్రుడు సినిమాలు విడుదల అయ్యాయి. ఇకపోతే వచ్చే సంవత్సరం కూడా ఈ ముగ్గురు బాక్సా ఫీస్ దగ్గర పోటీపడే అవకాశం కనబడుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో వెంకటేష్ కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ మూవీ సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అదే గాని జరిగితే మరోసారి చిరు , వెంకీ , బాలయ్య సంక్రాంతి బరిలో నిలిచినట్లు అవుతుంది. ఈ సారి కూడా సంక్రాంతి పనిలో నాగార్జున మిస్ అవుతాడు. ఇకపోతే వచ్చే సంవత్సరం సంక్రాంతి పండక్కు ఎవరెవరి మధ్య పోటీ ఉంటుంది అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: