యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ రోల్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి రాగా నాగవంశీ ఎన్నో ప్రశ్నలకు సంబంధించి జవాబిచ్చారు. సినిమాలో తారక్ ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోతోందని నాగవంశీ చెప్పుకొచ్చారు. సినిమా అంతటా జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారని హృతిక్, తారక్ కాంబో సీన్స్ హైలెట్ అవుతాయని వెల్లడించారు.

యంగ్  టైగర్  జూనియర్ ఎన్టీఆర్ జడ్జిమెంట్ ను నమ్మి ఈ సినిమా హక్కులను కొనుగోలు  చేశానని నాగవంశీ వెల్లడించారు. నాగవంశీ   నమ్మకం వార్2 సినిమా విషయంలో నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది.  వార్2 సినిమాలో  తారక్  ఎంట్రీ  వేరే లెవెల్ లో ఉంటుందని  నాగవంశీ  చెప్పిన  ఒక్క మాట  ఫ్యాన్స్ ఆనందానికి కారణమవుతోంది.  తారక్  ప్లానింగ్ ను బట్టి లైనప్  ఉంటుందని నాగవంశీ  వెల్లడించడం గమనార్హం.

దేవర2 సినిమా విషయంలో సైతం  తారక్ వెనక్కు తగ్గే ఛాన్స్ అయితే  లేదని  తెలుస్తోంది.   జూనియర్ ఎన్టీఆర్ లైనప్ గురించి  క్లారిటీ రావాలంటే  ఆయన స్వయంగా స్పందించే వరకు ఆగాల్సిందే.  తారక్ వార్2  సినిమా ప్రమోషన్స్ లో   ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పడంలో సందేహం అవసరం అయితే లేదు.

వార్2 సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు ఏకంగా 80 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. 160 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్లను సాధిస్తే  ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.  తన తర్వాత సినిమాల ఫలితాల విషయంలో  యంగ్  టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ తో  ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: