
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రెసెంట్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ సినిమాలు నటిస్తున్నాడు . ఈ సినిమా పేరు "పెద్ది". ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . 80% ఈ సినిమా షూట్ కంప్లీట్ అయిపోయింది . కేవలం మిగిలింది 20 పర్సెంట్ మాత్రమే . ఈ 20 పర్సెంట్ కూడా త్వర త్వరగా ఫినిష్ చేయాలని చూస్తున్నాడు బుచ్చిబాబు సనా. కాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశీ రౌతేలా ను చూస్ చేసుకున్నట్లుగా న్యూస్ బాగా ట్రెండ్ అయ్యింది.
అయితే సడెన్ గా ఈ పాట నుంచి ఆమెని తప్పించి లైన్ లోకి రాంచరణ్ లక్కీ బ్యూటీ తమన్నాను తీసుకొచ్చారట మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సనా. చరణ్ - ఊర్వశీ రౌతేలా కాంబో అంతగా సూట్ కాకపోవచ్చు అని.. లాస్ట్ మినిట్ లో మూవీ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట . ఆల్రెడీ ప్రభాస్ "రాజా సాబ్" సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయబోతుంది అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది . ఇప్పుడు "పెద్ది" సినిమాలో కూడా తమన్నా.. స్పెషల్ సాంగ్ చేయబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఓ హీరోయిన్ ఇలా స్పెషల్ సాంగ్ లో నటించడానికి ఓకే చేయడం మామూలు విషయం కాదు . గతంలో రామ్ చరణ్ - తమన్నా కాంబోలో "రచ్చ" సినిమా వచ్చి అభిమానులను ఆకట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే..!!