కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లయితే ఇండియాలో ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లను వాడే వారి సంఖ్య అత్యంత తక్కువగా ఉండేది. ఎప్పుడు అయితే ఇండియా లోకి కరోనా వచ్చిందో అప్పటి నుండి ఓ టీ టీ ల వాడకం భారతదేశంలో అత్యంత ఎక్కువగా పెరిగిపోయింది. ఇక సినిమా టికెట్ ధరలు కూడా రోజు రోజుకు పెరుగుతూ వస్తుండడంతో అనేక మంది థియేటర్కు వెళ్లి సినిమా చూడడం కూడా ఓ టీ టీ లో మూవీ చూడడం బెటర్ అనే ఆలోచనకు రావడంతో ఓ టీ టీ వినియోగదారుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.

ఇకపోతే దీనినే ఓ టి టి సంస్థలు కూడా అలుసుగా చేసుకొని పెద్ద స్థాయి దందానే కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా ఒక ప్రముఖ వార్తా పత్రిక కథనం ప్రకారం ... ఏదైనా ఒక ఓ టి టి ప్లాట్ ఫామ్ యొక్క సబ్‌స్క్రిప్షన్ ను తీసుకున్నాక , ఆ సబ్‌స్క్రిప్షన్ ను రద్దు చేయడం అత్యంత కష్టంగా మారుతుంది అని , దానిని రద్దు చేయాలి అంటే ఎంతో కష్టమైన పద్ధతిని ఫాలో అయ్యే విధంగా ఓ టీ టీ సంస్థలు ప్లాన్ చేసుకున్నాయి , అలాగే ఒక్క సారి కనుక ఓ టి టి సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే అది ఆటో డెబిట్ ఆప్షన్ లోకి వెళుతుంది అని , దానిని క్యాన్సిల్ చెయ్యాలి అంటే అది చాలా పెద్ద ప్రాసెస్ అని , అది కాస్త సామాన్యులకు వీలు కాదు అని , దానితో వారు దానిని రద్దు చేయలేక అనేక సార్లు డబ్బును పోగొట్టుకున్నట్టు ఓ సర్వేలో తేలినట్లు ఆ వార్తా పత్రిక ఓ కథనాన్ని విడుదల చేసింది.

ఇలా ఓ టీ టీ సబ్‌స్క్రిప్షన్ ఒక్క సారి  తీసుకున్నట్లయితే అది ఆటోమేటిక్గా డెబిట్ అయ్యే ఆప్షన్ లోకి వెళ్లిపోవడం వల్ల అనేక మంది సామాన్యులు కూడా అనవసరంగా డబ్బులు కోల్పోతున్నారు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: