సినిమా ఇండస్ట్రీ లో కొన్ని వారాలు పెద్దగా సినిమాలు విడుదల కావు. అలాంటి సమయంలో సినిమాలను థియేటర్కు వెళ్లి చూసే ప్రేక్షకులు కూడా ఏ సినిమాలు లేవు అనే నిరుత్సాహంలో ఉండిపోతూ ఉంటారు. ఇక కొన్ని రోజుల్లో మాత్రం భారీ ఎత్తున సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. దానితో మూవీ లవర్స్ ఒకే రోజు భారీ ఎత్తున సినిమాలు విడుదల కావడంతో ఏ మూవీ కి వెళ్ళాలి అనే విషయంలో కాస్త కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇలా కొన్ని సందర్భాలలో ఒకే రోజు అనేక సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి.

అలా ఈ సంవత్సరం కూడా ఒక రోజు ఏకంగా మూడు క్రేజీ సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అసలు విషయం లోకి వెళితే  ... ప్రస్తుతం టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ , కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న మిరాయ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రష్మిక మందన తన కెరియర్లో మొట్ట మొదటి సారి ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ తో లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని కూడా సెప్టెంబర్ 5 వ తేదీనే విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఇలా ఇప్పటికే ఈ తేదీన రెండు క్రేజీ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్న నేపథ్యంలో మరో మూవీ కూడా ఈ తేదీనే విడుదల చేయాలి అని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అనుష్క శెట్టి "ఘాటీ " అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని కూడా సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయాలి అని ఆలోచనకు మేకర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అదే గానీ జరిగితే ఒకే రోజు ఈ మూడు క్రేజీ సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర తలపడే అవకాశం ఉంటుంది. మరి ఈ మూడు సినిమాలు ఒకే రోజు విడుదల అవుతాయా ... లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: