మంచు విష్ణు కన్నప్ప మూవీ తీసి బొక్క బోర్లా పడ్డాడు.అయితే మొదటి రెండు రోజులు రెస్పాన్స్ బాగా రావడంతో సినిమా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని తెగ మురిసిపోయాడు.కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.దాంతో సినిమాకి భారీ నష్టాలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమాని చూసిన కొంత మంది సన్యాసులు ఇండస్ట్రీ వాళ్ళు కూడా అందులో రొమాంటిక్ యాంగిల్ పెట్టకపోతే మరింత బాగుండేది అని అంటున్నారు. కానీ రొమాంటిక్ యాంగిల్ పెడితేనే యూత్ సినిమాని చూస్తారు కావచ్చు అనే ఉద్దేశంతో విష్ణు ఈ సన్నివేశాలను యాడ్ చేశారు. కానీ కన్నప్ప లాంటి భక్తి సినిమాలో ఇలాంటి రొమాన్స్ ని పెట్టడం సాధువు, సన్యాసులకు ఏమాత్రం నచ్చలేదు. అయితే కన్నప్పని విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకున్నారు. 

భారీ తారాగణంతో పాటు భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీశారు. కానీ తీరా రిజల్ట్ ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. అంతేకాదు ఈ సినిమాకి నిర్మాతగా చేసిన మోహన్ బాబు పెట్టిన డబ్బులు కూడా చాలా వరకు పోయాయని కానీ బయటికి చెప్పుకోవడం లేదని అంటున్నారు.అయితే ఇప్పటికే కన్నప్ప సినిమా తీసి బోర్లా పడ్డ మంచు విష్ణువు మళ్ళీ రామాయణం సినిమా తీస్తానంటూ చెబుతున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ.. నాకు ఎప్పటినుండో రామాయణం సినిమా తీయాలనే కోరిక కూడా ఉంది. ఇందులో రామాయణం అంటే రామాయణం కథ కాకుండా రావణుని గురించి చూపిద్దాం అనుకుంటున్నా. ఇక రావణుడి పాత్రలో మా నాన్నని పెడదామనుకుంటున్నాం. డైలాగులు కూడా రాసుకున్నాం.

అలాగే కోలీవుడ్ హీరో సూర్యని రాముడిగా తీసుకోవాలని అనుకున్నాం. సూర్యని కూడా సంప్రదించాం. సీతగా అలియా భట్,లక్ష్మణుడిగా కళ్యాణ్ రామ్,నేను హనుమంతుడి పాత్రలో, ఇంద్రజిత్తుగా కార్తీని అనుకున్నాను. అంతేకాకుండా ఈ సినిమాకి రాఘవేందర్రావు దర్శకత్వం వహించాలని కూడా అనుకున్నాం. ఈ విషయాన్ని రాఘవేంద్రరావుకి చెప్పగా నువ్వు హనుమంతుని పాత్రలో కాదు ఇంద్రజిత్తుగా సెట్ అవుతావని రాఘవేంద్రరావు అన్నారు. అలాగే జటాయు పాత్రకి సత్య రాజ్ ని తీసుకోవాలి అనుకున్నాం. ఇక ఈ సినిమాలో రాముడి గురించి కాకుండా రావణుడు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు జరిగిన దాన్ని చూపించాలి అనుకున్నాం. 

ఈ సినిమాని 2009లోనే అనుకున్నాం. కానీ బడ్జెట్ సర్దుబాటు కాకపోవడంతో సినిమా ఆగిపోయింది. ఒకవేళ ఈ సినిమా చేస్తే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన వాళ్లనే ఆ పాత్రల్లో తీసుకుంటాను అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చారు.ఇక మంచు విష్ణు మాట్లాడిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో కన్నప్ప తీసి బొక్క బోర్లా పడ్డావ్ మళ్లీ రామాయణం ఇస్తానంటున్నావా.. వద్దు బాబోయ్ నీకు నీ ప్రాజెక్టులకు ఓ దండం అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక మరికొంత మందేమో కన్నప్పలో  రొమాంటిక్ యాంగిల్ చూపించావు రామాయణంలో అలాంటి రొమాన్స్ చూపిస్తే ప్రేక్షకులు ఇంటికొచ్చి మరీ కొడతారు. పురాణ కథలు మార్చచ్చు కానీ మరి ఇంతలా మార్చకూడదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: