విజయ్ దేవరకొండ హీరోగా భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించగా... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఈ మూవీ ని జూలై 31 వ తేదీన విడుదల చేయనున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రంలో కేవలం ఈ మూవీ తెలుగు , తమిళ్ విడుదల గురించి మాత్రమే ప్రస్తావించారు. హిందీ విడుదల గురించి ప్రస్తావించలేదు.

దానితో ఈ సినిమాను హిందీలో విడుదల చేయడం లేదు అని , ఈ మూవీ హిందీ వర్షన్ నేరుగా ఓ టీ టీ లో విడుదల అవుతుంది అని కొన్ని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ మూవీ నిర్మాత అయినటువంటి నాగ వంశీ దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. నాగ వంశీ ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... కింగ్డమ్ అనే టైటిల్ హిందీలో ఇప్పటికే రిజిస్టర్ అయి ఉంది. దానితో మేము విడుదల తేదీ పోస్టర్లో హిందీ వర్షన్ గురించి ప్రస్తావించలేదు. కొత్త టైటిల్ను అనుకున్న తర్వాత హిందీ వర్షన్ విడుదల తేదీ గురించి ప్రకటిస్తాం అని ఆయన అన్నారు. ఇకపోతే తాజాగా కింగ్డమ్ సినిమా హిందీ వర్షన్ టైటిల్ను మేకర్స్ కన్ఫామ్ చేశారు. అలాగే దానిని అధికారికంగా ప్రకటించారు.

మూవీ హిందీ వర్షన్ కు సామ్రాజ్య అనే టైటిల్ను మేకర్స్ ఫిక్స్ చేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ ఓ టీ టీ డీల్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను నెట్ ఫ్లిక్స్  సంస్థ ఏకంగా 50 కోట్లకు దక్కించుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd