తెలుగు బుల్లితెరపై సక్సెస్ ఫుల్ షోలతో దూసుకుపోతున్న షోలు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు. ఈ షోలకు యాంకర్ గా రష్మి కొనసాగుతోంది.అదే  క్రేజ్ తో పలు చిత్రాలలో కూడా నటించింది. అయితే హీరోయిన్గా ట్రై చేసిన ఎందుకో సక్సెస్ కాలేకపోయింది రష్మి. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది.  తాజాగా రష్మీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేసింది. ఈ విషయం చూసి అటు అభిమానులు, నేటిజెన్లు ఒక్కసారిగా  షాక్ అవుతున్నారు.



అయితే రష్మి ఇలా రాసుకుంటూ.. ప్రస్తుతం నేను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కూడా ఇబ్బందులలో ఉన్నానని.. సోషల్ మీడియాలో చెప్పే అడ్డమైన  నీతుల గురించి తాను వినే ఓపిక, తీరిక తనకు లేదంటూ తెలిపింది. అందుకే ఒక నెల రోజులపాటు తాను సోషల్ మీడియాకి దూరంగా ఉండబోతున్నానంటూ తెలిపింది. తాను అన్నిటికీ మళ్ళీ బలంగా, ధైర్యంగా తిరిగి వస్తానని హామీ ఇస్తున్నానని వెల్లడించింది రష్మి. అందుకు మీ సపోర్ట్ అవసరం అంటూ తెలియజేసింది రష్మీ. తన మీద తన నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదని కానీ ఎక్కడో ఒకచోట చాలా కుంగిపోతున్నాను ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం కనుక్కోవలసిన సమయం వచ్చిందంటూ తెలియజేసింది రష్మీ.



అయితే యాంకర్ రష్మి షేర్ చేసిన ఈ పోస్ట్ కి అభిమానులు, నేటిజెన్లు పలు రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. గడిచిన కొద్ది రోజుల క్రితం రష్మీకి ఒక సర్జరీ కూడా జరిగింది. ఆ కారణంగానే ఆమె ఇలా మానసికంగా ఇబ్బంది పడుతోందా అంటూ  మరి కొంతమంది అభిమానులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ రష్మి మళ్ళీ తిరిగి త్వరగా కోలుకొని రావాలని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలంటూ అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: