"హరిహర వీరమల్లు".. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరే మారుమ్రోగిపోతుంది. దానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం నటించి రిలీజ్ అయిన సినిమా ఇదే కావడం.  కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన "హరిహర వీరమల్లు" సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది . దీంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ టైం లో కొంతమంది ఆయనకు ఎలా నెగిటివిటీ క్రియేట్ చేయాలి అని చూసారో అందరికీ తెలిసిందే .


మరీ ముఖ్యంగా "బాయ్ కాట్ హరిహర వీరమల్లు" అంటూ సోషల్ మీడియాలో ఓపెన్ గానే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేశారు . హరిహర వీరమల్లు సినిమా ఎవరు చూడకూడదు అంటూ కూడా పిలుపునిచ్చారు.  కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం దానిని పెద్దగా పట్టించుకోలేదు . మా పవర్ స్టార్ మూవీ ఎవడ్రా చూడకుండా ఆపేది అంటూ నిన్న రాత్రి నుంచే  థియేటర్స్  వద్ద హంగామా స్టార్ట్ చేశారు . అంత కష్టపడినందుకు హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని చక్కగా చూపించారు డైరెక్టర్ జ్యోతి కృష్ణ .



కాగా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోని హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు . మరి ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ని మెప్పించడం అనేది అస్సలు ఈజీ కాదు . కానీ అందులో కొంతమేర సక్సెస్ అయ్యాడు జ్యోతి కృష్ణ అని చెప్పాలి.  అయితే ముఖ్యంగా కొన్ని కొన్ని సీన్స్ లో పవన్ కళ్యాణ్ ని చూపించే విధానంలో తడబడ్డాడు . జ్యోతి కృష్ణ దర్శకత్వ అనుభవం అంతగా లేక పవన్ కళ్యాణ్ ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.  అంతేకాదు హరిహర వీరమల్లు సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ జ్యోతి కృష్ణ కన్నా కూడా అందరూక్రిష్  గురించే మాట్లాడుకుంటున్నారు . ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత జ్యోతి కృష్ణ కన్నా కూడా క్రిష్ పేరు హైలెట్ గా మారింది.



దానికి కారణం సినిమాలోని కొన్ని కొన్ని షాట్స్ లో క్రిష్ దర్శకత్వం కొట్టోచ్చిన్నట్లు కనిపిస్తుంది. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా టైంలో ఆయన నేర్చుకున్న పాఠాలు ఈ సినిమాకి బాగా ఉపయోగపడ్డాయి.  అంతేకాదు అసలు అనుభవం లేని జ్యోతి కృష్ణ ఇంత పెద్ద సినిమాని ఈ విధంగా డైరెక్ట్ చేయలేడు అంటూ ఓపెన్ గానే చెప్పేస్తున్నారు ఫ్యాన్స్ . దీని వెనక అంతా కూడా క్రిష్ ఉండి నడిపించాడు అని మాట్లాడుకుంటున్నారు . దీనితో సోషల్ మీడియాలో ఇప్పుడు జ్యోతి కృష్ణ పేరు కన్నా కూడా క్రిష్ పేరు హైలెట్ గా మారింది.  కావాలనే కొంతమంది దీనిని వెటకారంగా కూడా ట్రోల్ చేస్తున్నారు . కష్టపడి తెరకెక్కించింది జ్యోతి కృష్ణ క్రెడిట్  మొత్తం కొట్టేసింది క్రిష్..భలే బాగుందే ఈ యవ్వారం అంటూ కావాలనే సినిమా గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు.  అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇవేమీ పెద్దగా పట్టించుకోవడం లేదు . పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాని బాగా లైక్ చేస్తూ సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసే దిశగా దూసుకుపోయేలా చేస్తున్నారు . చూద్దాం మరి మొదటి రోజు ఏ విధమైనటువంటి కలెక్షన్స్ సాధిస్తుందో ఈ హరిహర వీరమల్లు సినిమా..???

మరింత సమాచారం తెలుసుకోండి: