
జ్యోతి కృష్ణ కి దర్శకత్వ అనుభవం పెద్దగా లేకపోయిన కారణంగా కొన్ని కొన్ని సీన్స్ లో పవన్ కళ్యాణ్ ని హ్యాండిల్ చేయలేక తడబడ్డాడు అన్న విషయం థియేటర్స్ లో సినిమా చూస్తున్నంత సేపు ఈజీగా అర్థమయిపోయింది . మరి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లిన జ్యోతి కృష్ణ సెకండ్ హాఫ్ లో కొన్ని కొన్ని చోట్ల బోర్ కొట్టించాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి . హిందూ ధర్మ పరిరక్షణ నేపథ్యంలో సెకండ్ హాఫ్ ఎక్కువగా కథ నడిపించడం కొంచెం మైనస్ గా మారింది . సనాతన ధర్మం అంశాన్ని కూడా బాగా వాడుకున్నారు అనే చెప్పాలి . బీజేపీ అభిమానులకు ఈ సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుంది అని చెప్పడంలో నో డౌట్ . అయితే ఇదే మూమెంట్లో సినిమా ఎందుకు థియేటర్స్ లోనే చూడాలి అని ఐదు పాయింట్లు హైలైట్ గా మారాయి.
* మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే కచ్చితంగా అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఫ్యాన్స్ అరుపులు , కేకలు. మనం ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తే ఆ అరుపులు కేకులు మిస్ అయిపోతాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరుస్తూ పేపర్లు ఎగరేస్తూ విజిల్స్ తో థియేటర్స్ లో సందడి చేస్తారు . అలాంటి వాతావరణంలో చూస్తేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేయగలరు .
* హరిహర వీరమల్లు సినిమా మొత్తం కూడా పిరియాడిక్ డ్రామా . ఇందులో సెట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పెద్ద స్క్రీన్ లో చూస్తేనే ఆ కిక్ వస్తుంది .
* అంతేకాదు పవన్ కళ్యాణ్ చాలాకాలం తర్వాత తెరపై కనిపించిన సినిమా కావడంతో ఈ సినిమాను థియేటర్స్ లో చూస్తేనే బాగుంటుంది అంటున్నారు పవన్ ఫ్యాన్స్.
* ఇక కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకి మరింత హైలెట్ గా మారింది. పవన్ కళ్యాణ్ కటౌట్ కి ఆ విజువల్స్ కి ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మన చిన్న టీవీలో చూస్తే పెద్దగా కంటికి ఆనకపోవచ్చు . పెద్ద స్క్రీన్ పై చూస్తేనే ఆ ఫీలింగ్ కలుగుతుంది .
*అన్నిటికంటే ముఖ్యంగా పైరసీని అవాయిడ్ చేయాలి. సోషల్ మీడియాలో లీక్ అయ్యే మూవీ ప్రింట్స్ ని ఎంకరేజ్ చేయకూడదు. ఇలా ప్రతి ఒక్కరు కూడా థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తే తద్వారా పైరసీని కొంచెం తగ్గించొచ్చు అంటున్నారు సినీ ప్రముఖులు .
మొత్తానికి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో భారీ స్థాయిలోనే హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు . మొదటి రోజు కలెక్షన్స్ నే 100 కోట్లు కలెక్ట్ చేయొచ్చు అంటూ ప్రిడిక్ట్ చేస్తున్నారు సినీ విశ్లేషకులు . చూద్దాం మరి ఏం జరుగుతుందో...???