నాలుగు పదుల వయసుకు చేరువవుతున్న ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తున్న సౌత్ హీరోయిన్స్ లో నిత్యామీనన్ ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ కెరీర్ ప్రారంభించిన నిత్యా.. ఆ తర్వాతి కాలంలో హీరోయిన్ గా మారింది. కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో సినిమాలు చేస్తూ దక్షిణాది ప్రేక్షకులకు చేరువైంది. మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీగా గుర్తింపు సంపాదించుకుంది. కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ ను చూసిన నిత్యామీనన్.. ప‌ర్స‌న‌ల్‌ లైఫ్ లో మాత్రం వెనకబడిపోయింది.


37 ఏళ్లు వచ్చినా పెళ్లికి దూరంగా ఉండడానికి కారణం ఏంటో తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిత్యామీనన్ వెల్లడించింది. గతంలో ప్రేమ బంధాలన్నీ విఫలమై మనోవేదనను మిగిల్చాయని.. బ్రేకప్స్‌ తనకు ఎన్నో పాఠాలు నేర్పాయ‌ని.. అందుకే పెళ్లికి దూరంగా ఉన్నాన‌ని మనసులో మాటల‌ను నిత్యా బయటపెట్టింది. అలాగే పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `టీనేజ్‌లో సోల్మెట్ తప్పకుండా అవసరమ‌నే భావనలో ఉండే దాన్ని. నా జీవిత భాగస్వామి కోసం అన్వేషించిన సందర్భాలు ఉన్నాయి.


కానీ కాలక్ర‌మేణ‌ నా అభిప్రాయాలు మారాయి. పెళ్లి అనేది ఒక ఎంపిక మాత్రమే.. తప్పనిసరి అవసరం కాదు.  రతన్‌టాటా పెళ్లి చేసుకోలేదు. అయిన కూడా ఆయ‌న జీవితంలో ఎన్నో సాధించారు. తోడు లేద‌ని కొంచెం బాధగా ఉన్న స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. పెళ్లయితే చాలా గొప్ప విషయం.. ఒకవేళ కాకున్న గొప్ప విషయమే. ఏం జరిగినా అది మన‌ మంచికే అనుకుని ముందుకు సాగిపోవాలి` అంటూ నిత్యా మీన‌న్‌ చెప్పుకొచ్చింది. మొత్తంగా నిత్యా మాటలు బ‌ట్టి చూస్తుంటే లైఫ్ లాంగ్ ఆమె పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోతుందా? అన్న అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: