
ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కావాల్సిన విశ్వంభర డిసెంబర్ నెలలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో మూవీ సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే నెల రోజుల గ్యాప్ లో రెండు సినిమాలు విడుదలైతే రెండు సినిమాల కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం అయితే ఉంది.
అయితే చిరంజీవి ప్లానింగ్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. చిరంజీవి పారితోషికం 60 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందడి చేయడంతో పాటు భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవి ఖాతాలో ఎన్నో రికార్డులు చేరాలని అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
చిరంజీవి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి ఒక్కో మెట్టు కెరీర్ పరంగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారని సంగతి తెలిసిందే. చిరంజీవి ఇతర భాషల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు