
అయితే ఇలాంటి వాళ్లపై కేంద్రం ఎప్పటినుంచో దృష్టి పెడుతూ వచ్చింది . తాజాగా తీసుకున్న కఠిన చట్టం పైరసీ చేయాలి అన్న కేటుగాళ్లకు వణుకు పుట్టించేలా చేస్తుంది. ఎవరైనా సరే సినిమా ని పైరసీ చేసి అమ్ముకున్న సినిమా పైరసీని ఎంకరేజ్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ వారిని కఠినంగా శిక్షిస్తుంది . తాజాగా సినిమా ల పైరసీని అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం సినిమా ఆటోగ్రాఫీ చట్టాన్ని సవరించింది . ఇప్పటినుంచి ఎవరైనా సరే చట్ట విరుద్ధంగా సినిమాలను ప్రసారం చేసిన.. అలాగే రికార్డ్ చేసి పైరసీ రిలీజ్ చేసిన మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు నిర్మాణ వ్యాయాయంలో 5% వరకు జరిమాన కట్టాల్సిందే .
ఖచ్చితంగా జైలుకు వెళ్లి చిప్పకూడు తినాల్సిందే . ఈ విధంగా చట్టాన్ని సవరించింది . గతంలో సినిమా పైరసి చేస్తే మూడేళ్లు జైలు శిక్ష తో పాటు మూడు లక్షలు జరిమానా ఉండేది . ఇప్పుడు ఆ చట్టాన్ని మారుస్తూ మూడు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు సినిమా నిర్మించిన వ్యయంలో ఐదు శాతం జరిమాన కట్టాలి అంటూ తేల్చి చెప్పింది ప్రభుత్వం . ఈ విషయాన్ని తాజాగా ప్రసార శాఖల సహాయ మంత్రి ఎల్ మురుగన్ వెల్లడించారు. దీంతో పైరసీ రాయళ్ళుకు పెద్ద తలనొప్పే స్టార్ట్ అయ్యింది..!