జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ కాంబోలో తాజాగా వార్ 2 అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ.లో కీయార అద్వానీ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను ఆగస్టు 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ కి ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ లభించిన ఆ తర్వాత ఈ మూవీ ట్రైలర్ కు మాత్రం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

మూవీ ట్రైలర్ విడుదల అయ్యాక ఈ సినిమాపై అంచనాలు కూడా జనాల్లో కాస్త పెరిగాయి అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాను యాష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ వారు అత్యంత భారీ బడ్జెట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా స్పై యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ లో రూపొందింది. యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు ఇప్పటికే అనేక స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలను రూపొందించారు. ఈ బ్యానర్ వారు నిర్మించిన స్పై యాక్షన్  నిర్మించిన స్పై యూనివర్స్ మూవీలలో పటాన్ , టైగర్ మూవీ లు కూడా ఉన్నాయి. ఇకపోతే పటాన్ , టైగర్ 3 మూవీల మాదిరి గానే వార్ 2 సినిమా చివరన కూడా కొన్ని సినిమాలకు సంబంధించిన అప్డేట్లను ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం వార్ 2 సినిమా చివరన పటాన్ 2 మూవీ కి సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నట్లు , అలాగే యాష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుండి రాబోతున్న ఫస్ట్ ఫీమేల్ ఓరియెంటెడ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ఆల్ఫా సినిమాకు సంబంధించిన అప్డేట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి విడుదల ఆయన ప్రచార చిత్రాల ద్వారా ఈ మూవీలో అదిరిపోయే రేంజ్ యాక్షన్ సీన్స్ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: