- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర నుంచే ఒక క్రేజీ ప్రాజెక్టులో న‌టిస్తున్నాడు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి - మ‌హేష్ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతోన్న ప్రాజెక్టు పై అంచ‌నాలు మామూలుగా లేవు. ఈ సినిమా థియేట‌ర్ల లోకి రావ‌డానికి మ‌రో రెండేళ్ల టైం ప‌ట్టేలా ఉంది. అయితే ఈ లోగా మ‌హేష్ బాబు త‌న ఫ్యాన్స్ ను నిరాశ ప‌ర‌చ‌కుండా త‌న పాత సినిమాల‌ను రీ రిలీజ్ చేస్తూ థియేట‌ర్ల లో మంచి ట్రీట్ ఇస్తున్నాడు. మ‌హేష్ క్లాసిక్  సినిమాలు మళ్ళీ థియేటర్స్ లోకి వచ్చి భారీ రెస్పాన్స్ కొల్లగొడుతున్నాయి. ఈ క్ర‌మంలో నే ఈ యేడాది త‌న పుట్టిన రోజు కానుక‌గా అత‌డు రీ రిలీజ్ అవుతోంది.


సినిమా మ‌హేష్ బాబు స్ట్రాంగ్ జోన్‌లో దుమ్ము రేపేస్తోంది. యూఎస్ మార్కెట్ లో ఆల్రెడీ ఈ సినిమా క్రేజీ వసూళ్లు రాబడుతుంది. అత‌డు రీ రిలీజ్ కు ఇంకా వారం గడువు ఉండగానే ఆల్రెడీ 10 వేల డాలర్స్ కి పైగా వసూళ్లు అందుకుంది. ఈ క్ర‌మంలోనే అతడు సినిమా ఏ రేంజ్ హైప్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆల్రెడీ ఖలేజా రీరిలీజ్ తో యూఎస్ మార్కెట్ లో ఆల్ టైం రికార్డు నంబర్స్ సెట్ చేసిన మహేష్ మ‌రోసారి అత‌డు మానియాతో దుమ్ము దులిపేయ నున్నాడు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: