సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉన్న సీనియర్ హీరోలలో వెంకటేష్, నాగార్జున  కూడా ఉంటారు.. ఇంచుమించు ఈ ఇద్దరు హీరోలు ఒకే సమయానికి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. అలాగే ఇద్దరు కూడా సినీ బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలే. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కానీ సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే తప్పనిసరిగా టాలెంట్ అనేది ఉండాలి.. అలా సినిమా ఇండస్ట్రీలో వెంకటేష్ కంటే ముందు నాగార్జునను స్టార్ హీరో చేయాలని నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు వెంకటేష్ ను తొక్కేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.. అది ఎలా జరిగింది? ఆయనను తొక్కడానికి ఎలాంటి ప్రయత్నం చేశారు? ఆ వివరాలు చూద్దాం.. 

నాగార్జున ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో  నాగేశ్వరరావు టాప్ 5 డైరెక్టర్ల అందరి సినిమాలు నాగార్జునకి వచ్చేటట్టు చేశాడు.. అలా వెంకటేష్ తో సినిమా చేయాలనే ఆలోచన కూడా డైరెక్టర్లకు రాకుండా చేయడంలో ప్రముఖ పాత్ర పోషించాడని చెప్పవచ్చు. ఒకవేళ వెంకటేష్ స్టార్ గా ఎదిగితే తన కొడుకు వెనుకబడి పోతాడనే ఆలోచనో ఏమో కాని అందరు డైరెక్టర్లు, నిర్మాతలను నాగార్జున వైపే తిరిగేలా చేసి ఆయనను స్టార్ హీరోని చేశారట. ఇదే తరుణంలో వెంకటేష్ తండ్రి రామానాయుడు కూడా  ఏఎన్ఆర్ కు పోటీగా తన కొడుక్కి టాప్ దర్శక, నిర్మాతలతో సినిమాలు చేయించి ఆయనను కూడా ఒక మంచి పొజిషన్ లో ఎదిగేలా చేశాడు.

అలా ఇద్దరి మధ్య కొన్ని ఏళ్లపాటు పోటీ ఏర్పడింది. ఒక్కోసారి ఇద్దరి సినిమాలు థియేటర్లలో పోటీపడుతూ సక్సెస్ సాధించేవి. అలా ఇద్దరు హీరోలు స్టార్ హీరోలుగా ఎదిగారు. ఆ తర్వాత  వెంకటేష్ సోదరిని ఏకంగా నాగార్జునకే ఇచ్చి పెళ్లి చేశారు. నాగచైతన్య   జన్మించిన తర్వాత వీరిద్దరి మధ్య కాస్త విభేదాలు  రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. అయినా ఇద్దరి మధ్య బంధుత్వం మాత్రం తొలగిపోలేదు. ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో వీళ్ళిద్దరూ కలుస్తూనే ఉంటారు. సినిమాల గురించి చర్చించుకుంటూనే ఉంటారు. అలా నాగేశ్వరరావు తన కొడుకును తొందరగా స్టార్ ను చేయడానికి, వెంకటేష్ ఓ రకంగా తొక్కేసే ప్రయత్నం చేశారని అప్పట్లో సినీ ఇండస్ట్రీలో ఉన్న వారు మాట్లాడుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: