గత కొద్దిరోజుల నుండి హన్సిక భర్తకు విడాకులు ఇవ్వబోతుంది అనే రూమర్లు సోషల్ మీడియాలో ఎంతగా ఊపందుకున్నాయో చెప్పనక్కర్లేదు. అయితే ఈ రూమర్లను కొట్టి పారేస్తూ మా ఇద్దరి విడాకుల వార్తలు ఫేక్ అంటూ మాట్లాడారు. అయితే ముంబై మీడియా విడాకుల వార్తల గురించి క్లారిటీ తెలుసుకోవడానికి హన్సిక ను ప్రశ్నించగా హన్సిక ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. కానీ సోహైల్ ని ఈ వార్తల గురించి అడగగా అలాంటిదేమీ లేదు. మేమిద్దరం కలిసే ఉంటున్నామని అన్నారు.కానీ ఈ మధ్యకాలంలో హన్సిక అత్తింటిని వదిలేసి పూర్తిగా తన పుట్టింటికే పరిమితమైనట్టు తెలుస్తోంది.ముఖ్యంగా అత్తింట్లో హన్సిక వేగలేకపోతున్నట్టు సమాచారం. 

ఎందుకంటే చిన్న ఫ్యామిలీ నుండి వెళ్లిన హన్సికకి ఉమ్మడి ఫ్యామిలీలో అంతగా సెట్ అవ్వట్లేదట. ముఖ్యంగా అత్త, ఆడపడుచులు అంటూ ఉమ్మడి కుటుంబం ఆమెకు నచ్చకపోవడంతో వేరుకాపురం పెడదామని సోహైల్ తో చెబితే ఆమెని పట్టించుకోకపోవడంతో అప్పటినుండి ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి దూరం దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.అయితే వీరి మధ్య ఉన్న దూరాన్ని తెలుసుకున్న మీడియా ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్టు క్రియేట్ చేసింది.ఇక ఈ విడాకుల వార్తలకు ఊతమిచ్చేలా తాజాగా హన్సిక చేసిన పని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అయితే చాలా మంది సెలబ్రెటీలు విడాకులు తీసుకునే ముందు బ్రేకప్ చెప్పుకునే ముందు తమ ప్రేమికులతో,భర్తలతో ఉన్న ఫోటోలను డిలీట్ చేస్తూ వారి  సోషల్ మీడియా ఖాతాలను అన్ ఫాలో చేస్తూ ఉంటారు. అయితే తాజాగా హన్సిక మోత్వాని కూడా తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలతో పాటు పెళ్లి ఫోటోలు అన్నీ డిలీట్ చేయడంతో వీరి విడాకుల వార్తలు నిజమే అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు విడాకుల గురించి నేరుగా స్పందించకుండా పెళ్లి ఫోటోలు డిలీట్ చేసి హన్సిక విడాకులు కన్ఫామ్ చేసింది అంటూ చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: