
టీజర్ మొదట్లో ఏదో ఒక గుహలోకి వెళ్లినట్లుగా చూపించారు. ఆ తర్వాత బంగారంతో ఆ గుహ మొత్తం కనిపిస్తోంది. అలా చివరికి ఒక చెట్టుని చూపిస్తారు. ఆ తర్వాతే సోనాక్షి సిన్హా ఎంట్రీ ఇస్తుంది. ఇక హీరో సుధీర్ బాబు కూడా ఏదో పురాతన గుడిలోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా చూపించారు. ఆ తర్వాత జరిగే పరిణామాలు అబ్బురపరిచేలా కనిపిస్తున్నాయి. దురాశకు త్యాగానికి మధ్య జరిగే పోరాటామే ఈ టీజర్ అన్నట్లుగా కనిపిస్తోంది. ఆధ్యాత్మిక అంశాలతో ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది.అయితే చివరిలో కూడా శివుడి పాత్ర హైలెట్గా చూపించారు.. మరి ఆ పాత్రలో ఎవరు నటిస్తున్నారో చూడాలి.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
సినిమాలో కీలకమైన పాత్రలలో విషయానికి వస్తే.. శిల్పా శిరోద్కర్, నవీన్ నేని, శుభలేఖ సుధాకర్, ఝాన్సీ, రవి ప్రకాష్ తదితర నటీనటులు ఇందులో నటించారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ సినిమాతో నైనా సుధీర్ బాబు కెరియర్ టర్నింగ్ పాయింట్ అవుతుందేమో చూడాలి మరి. హీరో సుధీర్ బాబు సరైన సక్సెస్ అందుకోక చాలా కాలం అవుతున్నది. సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ సక్సెస్ అందుకోవడంలో కొంత వెనక పడ్డారు.