మహేష్ బాబు ..టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద సూపర్ స్టార్ హీరో . ఈయన పేరు చెప్తే పూనకాలు  రాని అభిమాని అంటూ ఉండడు . ఆ హైట్ ..ఆ వెయిట్ ..ఆ కటౌట్  చూస్తే కొన్ని కొన్ని ఆయనను ఎవరు బీట్ చేయలేరు అని చెప్పుకోవడంలో సందేహమే లేదు . మహేష్ బాబు పుట్టినరోజు తన ఫ్యామిలీతో చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతిసారి లాగే మహేష్ బాబు తన పుట్టినరోజును చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండటం గమనార్హం .


కాగా అన్ని కరెక్ట్ గా కలిసొచ్చి ఉంటే మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ షెడ్యూల్ కోసం వేరే కంట్రీ వెళ్లాలి .. కానీ కొన్ని కారణాల చేత ఈ షెడ్యూల్ పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తుంది . ఆ కారణంగా ఫ్యామిలీతో చాలా సింపుల్ గా బర్త్డ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు మహేష్ బాబు అంటూ సినీ వర్గాలలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . ఈ మూమెంట్లోనే మహేష్ బాబుకు సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఆయన పరసనల్ విషయాలని కూడా వైరల్ చేస్తున్నారు.


మహేష్ బాబు తన కెరీయర్ లో మేకప్ వేసుకోకుండా చేసిన మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు . ఎస్ మహేష్ బాబు తన కెరీయర్ లో ఎన్నో సినిమాలల్లో నటించాడు . కానీ ఓ సినిమాలో మాత్రం అసలు మేకప్ నే వేసుకోలేదు . నేచురల్ లుక్స్ లోనే ఆకట్టుకున్నాడు.  ఆ సినిమా మరేంటో కాదు "నిజం". 2003లో తేజా దర్శకత్వంలో రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ గా మారింది . కానీ ఈ సినిమాలో మహేష్ బాబు నటన కు మంచి మార్కులు పడ్డాయి . ఈ సినిమాలో మహేష్ బాబు అసలు మేకప్ నే లేకుండా కనిపించడం ఆయన కెరియర్ లోనే స్పెషల్ గా నిలిచిపోయింది . ఆయన బర్త డే సందర్భంగా ఇదే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు జనాలు, అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: