
ఆమె మరి ఎవరో కాదు తన అంద చందాలతో ఇండస్ట్రీని ఏలేసిన సమంత . పుష్ప సినిమాలో ఊ అంటావా మామ ఊ ఊ అంటావా మావ అంటూ ఓ రేంజ్ లో ఇండస్ట్రీని తెగ ఊపేసిన సమంతతో ఈ స్పెషల్ సాంగ్ చేయించాలి అంటూ మూవీ మేకర్స్ ప్లాన్ చేశారట . సమంత ని డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యి ఈ పాట గురించి వివరించారట . కాని సమంత మాత్రం సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. బుచ్చిబాబు సనా స్పెషల్ గా రిక్వెస్ట్ చేసిన సరే సమంత ఇందుకు ఓకే చేయలేదట . అసలు ఆమె ఐటమ్ సాంగ్ అనగానే వెంటనే రిజెక్ట్ చేసేసిందట.
చరణ్ హీరో అని తెలిసిన కూడా సమంత ఈ పాటను రిజెక్ట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే ఆల్రెడీ ఊ అంటావా మావ సాంగ్ చేసి తను చాలా నెగిటివిటీని ఫేస్ చేసింది అని .. ఇప్పుడు ఇలాంటి ఒక పాట చేస్తే తన సెకండ్ పెళ్ళికి ఇబ్బందులు వస్తాయి అన్న కారణంగానే ఆమె ఆగిపోయి ఉండొచ్చు అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సమంత మంచి నిర్ణయం తీసుకుంది అంటూ ఒక వర్గం ప్రేక్షకులు పోగుడుతుంటే .. మరొక వర్గం మాత్రం రామ్ చరణ్ తో సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నావే అంటూ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మరి ఏ మాట చెప్పి ఇంకోసారి సమంతను అప్రోచ్ అయ్యి బుచ్చిబాబు సనా ఈ సినిమాలో ఆమెను చిందులు వేయడానికి ఓకే చేయిస్తారో చూడాలి . లేదంటే వేరే బ్యూటీని ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది..!??!