"మహేష్ బాబు".. ఆ పేరు పలుకుతూ ఉంటేనే ఏవేవో వైబ్రేషన్స్ వచ్చేస్తుంటాయి. ఆ కటౌట్ అలాంటిది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు గురించి ఎంత పొగిడినా తప్పు లేరు. రీసెంట్ గానే ఆయన తన 50వ పుట్టినరోజును చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు . మరి ముఖ్యంగా మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా గురించి జనాలు అభిమానులు మిగతా స్టేట్స్ లో ఉండే వాళ్ళు కూడా ఎక్కువగా మాట్లాడుకుంటూ వస్తున్నారు . దానికి కారణం రాజమౌళి . ఆ లెవెల్ స్టాండర్డ్ ని ఆయన తన సినిమాలతో చూపించారు.


అయితే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన "అతడు" సినిమాను రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లోను ఈ సినిమా అద్భుతంగా అభిమానులను ఆకట్టుకుంది . మరీ ముఖ్యంగా థియేటర్స్ లో చాలామంది ఫ్యాన్స్ అరుపులు కేకలతో రచ్చ రంబోలా చేశారు . మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పెద్ద కేక్ కట్ చేస్తూ జై మహేష్ బాబు అంటూ ఆయన బర్త్డ డే ని ఫ్యాన్స్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు . మరి కొంతమంది రక్త దానాలు కూడా చేశారు.



ఇలాంటి నేపథ్యంలోనే ఓ సరికొత్త వీడియోస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. అతడు సినిమా ధియేటర్ లో నడుస్తున్న నేపథ్యంలోనే మహేష్ బాబు అలాగే రోహిత్ శర్మ ఇద్దరు కలిసి ఉన్న ఒక వీడియో థియేటర్లో ప్లే చేశారు . మహేష్ బాబు అభిమానులు . ఈ వీడియోలో మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపాడు రోహిత్ శర్మ . దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . దీనికి సంబంధించిన వీడియోను ప్రత్యేకంగా క్రియేట్ చేయించి మరి మహేష్ బాబు ఫ్యాన్స్ థియేటర్లో ప్లే చేయించారు అంటే మహేష్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఆయనను అభిమానిస్తూ ఉంటారు అనేది అర్థం చేసుకోవచ్చు . ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ గా మారింది. అంతేకాదు కొంతమంది మహేష్ బాబు అభిమానులు ఈ వీడియో చూసిన తర్వాత అతడు సినిమాను రోహిత్ శర్మ చూసి రివ్యూ ఇస్తే బాగుంటుంది అంటూ మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాలుగా జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!



మరింత సమాచారం తెలుసుకోండి: