అల్లు అర్జున్ .. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ హీరో . పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్, పాపులారిటీ దక్కించుకున్న బడా హీరో. ఆయన ఎప్పుడెప్పుడు బయట కనిపిస్తాడా ..? ఆయన కనిపిస్తే ఫోటోలు తీసుకొని సెల్ఫీలు తీసుకొని ఆటోగ్రాఫ్ తీసుకుందామా..? అంటూ లక్షల సంఖ్యలో అభిమానులు వెయిట్ చేస్తూ ఉంటారు . బన్నీ బయట కనపడితే ఎంత హంగామా చేస్తూ ఉంటారో జనాలు అందరికీ తెలిసిందే . అయితే ఒక ఆఫీసర్ మాత్రం ఇప్పుడు బన్నీని అసలు గుర్తుపట్టలేకపోయాడు . మాస్క్ తీస్తే కూడా బన్నీ ని గుర్తు పట్టలేకపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.
 

అల్లు అర్జున్ - అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది.  ఈ క్రమంలోనే అల్లు అర్జున్ .. హైదరాబాద్ - ముంబై తిరుగుతూనే వస్తున్నారు.  తాజాగా ముంబై విమానాశ్రయంలో బన్నీకి ఘోర అవమానం జరిగింది. చెకింగ్ దగ్గర మాస్క్ పెట్టుకున్న బన్నీని గుర్తుపట్టలేకపోయారు అధికారి . మాస్క్ తీసి ముఖం చూపించమంటూ అడిగారు.  ఇది అక్కడ వీడియోలో రికార్డు అయ్యింది.  ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చెకింగ్ దగ్గర మాస్ పెట్టుకున్న బన్నీని గుర్తుపట్టని అధికారి మాస్క్ తీయమని అడిగాడు .



ఒకసారిగా షాక్ అయిపోయిన బన్నీ ఇక చేసేది ఏమీ లేక మాస్క్ తీసి తన ఫేస్ చూపించాడు. దాంతో బన్నీని లోపలికి పంపారు ఆ అధికారి.  ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది . ఈ వీడియో పై రక రకాల కామెంట్స్ వినపడుతున్నాయి . అయ్యయ్యో బన్నీని గుర్తు పెట్టలేకపోయావా అంటూ ఒకరు ..బన్నీకి ఘోర అవమానం జరిగింది అంటూ మరికొందరు .. పుష్ప రాజ్ ఇమేజ్ మొత్తం దిగిపోయింది అంటూ మరికొందరు .. రకరకాలుగా ఆయనని ట్రోల్ చేస్తున్నారు . అసలు ఇందులో బన్నీ తప్పే లేదు.. కానీ బన్నీని కావాలనే టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు.  బన్నీ తప్పు లేకపోయినా బన్నీని ఇలా టార్చర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ . ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ ఏం చేసినా సరే దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తుంది ఓ వర్గం.  సోషల్ మీడియాలో బన్నీని ఎప్పుడెప్పుడు ట్రోల్ చేద్దామా..? అని కాచుకొని వెయిట్ చేస్తుంది . వాళ్ళకి ఇది మంచి స్టఫ్ ఇచ్చిన కంటెంట్ లా మారిపోయింది. కొందరు పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి గురించి గుర్తు చేసుకుంటున్నారు. ఆ పాపమే బన్నీకి శాపం లా మారింది అంటున్నారు..!



మరింత సమాచారం తెలుసుకోండి: