
ఇలాంటి మూమెంట్ లోనే సోషల్ మీడియాలో హాట్ గా ఈ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఈసారి బిగ్ బాస్ 19 లోకి ఒక స్పెషల్ పర్సన్ ని తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల పెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వ్యక్తి భార్య హిమాన్షి నర్వాల్ ని బిగ్ బాస్ 19 షోలోకి కంటెస్టెంట్ గా తీసుకురాబోతున్నారట . ఈ సీజన్లో ప్రేక్షకులకు త్వరగా కనెక్ట్ అయ్యే పర్సన్స్ ని ఏరి కోరి చూస్ చేసుకుంటుంది యాజమాన్యం అంటూ ఇంతవరకు టాక్ వినిపించింది. ఇప్పుడు పెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వ్యక్తి భార్య హిమాన్షి ఈ షోలో కంటెస్టెంట్ గా రాబోతుంది అని తెలియడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది .
అంతేకాదు బిగ్ బాస్ ఓటీటీ 2 విజేత ఎల్విషి యాదవ్ కు ఒకప్పుడు కాలేజీ ఫ్రెండ్ ఈ హిమాన్షి నర్వల్ అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే ఈ వార్తలు నిజమే అంటూ జనాలు భావిస్తున్నారు . అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ టీం కాని వేరే వాళ్ళు కానీ ఆమెను అప్రోచ్ అవ్వలేదు అంటూ తెలుస్తుంది. మనందరికీ తెలిసిందే హిమాన్షి తన భర్తతో కలిసి హనీమూన్ కోసం పెహల్గాం వెళ్ళింది. అక్కడ తన భర్తను ఉగ్రవాదులు హతమార్చగా మృతదేహం వద్ద ఆమె రోదిస్తున్న సన్నివేశం ప్రపంచాన్ని కదిలించింది . ఆ కారణంగానే ఆమె బిగ్ బాస్ లోకి ఎంట్రీస్తే మొత్తం ఆసక్తికరంగా చూసే అవకాశం ఉంది అంటూ బిగ్ బాస్ టీం ఈ ప్లాన్ చేసింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి . కానీ ఇన్ సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు హిమాన్షు ని బిగ్ బాస్ టీం అప్రోచ్ అవ్వలేదు అంటూ తెలుస్తుంది . మరి ఈ వార్తలు ఎలా పుట్టుకొచ్చాయో ఎవరికీ అర్థం కావడం లేదు..!???