ఈ వార్తలో ఎంతవరకు నిజమో తెలియదు కానీ సోషల్ మీడియాలో.. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఒక ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో రష్మిక మందన్న ఎంత టాప్ హీరోయిన్ అనేది అందరికీ తెలిసిందే. ఆమె నటించే సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఆమె మాట్లాడే తీరు, ఆమె యాక్షన్ చేసే పద్ధతి బాలీవుడ్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అనిమల్ సినిమా తర్వాత అయితే బాలీవుడ్ ఆడియన్స్ కళ్లలో ఆమె దేవతలా మారిపోయింది.


ఇప్పుడు ఆమె ఒక కొత్త బడా హీరోతో చేసే ప్రాజెక్ట్‌కి సంబంధించిన వార్త హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా, బ్యాక్‌డ్రాప్‌లో ఫుల్ వర్క్స్ జరుగుతున్నాయని టాక్ వచ్చింది. ఆ సినిమాకి దాదాపు 40–50% షూటింగ్ పూర్తయ్యిందని సమాచారం. అయితే, రష్మిక మందన్నసినిమా నుంచి తప్పుకుందనే వార్తలు బాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే—రష్మిక ముందుగానే కొన్ని సీన్స్ తాను చేయనని చెప్పిందట. కానీ డైరెక్టర్ మాత్రం మొదట ఓకే చెప్పి, ఇప్పుడు అవి చేయాలని బలవంతం చేస్తున్నారట. అందుకే రష్మిక అడ్వాన్స్ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసి, సినిమా నుంచి తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.



ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. "రష్మిక చేయను" అని చెప్పిన ఆ సీన్స్ ఏవో, అవి ఎంత భయంకరంగా లేదా ఇబ్బందికరంగా ఉంటాయో అంటూ ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చ నడుస్తోంది. రష్మిక ఎప్పుడు ఇలా చేయదు ..ఫర్ ది ఫస్ట్ టైం ఇలా చేసింది అంటే సీన్ మరీ ఆమె ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండోచ్చు అంటున్నారు జనాలు. రష్మిక డబ్బు వెనక్కి ఇచ్చి మంచి పనే చేసింది అంటున్నారు. చూడాలి మరి దీని పై రష్మిక ఎలా స్పందిస్తుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: