
కానీ ఆ లెక్కను సరి చేసింది రజనీకాంత్. తాజాగా ఆయన నటించిన "కూలీ" సినిమా ఆ మార్క్‌ని టచ్ చేసింది. దీంతో 20 కోట్ల వసూళ్లు సాధించిన ఆరు సినిమాలు ఉన్న హీరోల లిస్ట్‌లో ప్రభాస్‌తో పాటు రజనీకాంత్ కూడా చేరిపోయారు. మిగతా ఏ హీరోలు ఇందులో దరిదాపుల్లోకీ రాలేకపోవడం గమనార్హం. చాలా మంది కన్నడ ఇండస్ట్రీ వైపు చూస్తున్నారు. అక్కడ తమ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కూడా చేసుకుంటారు. కానీ అన్ని సినిమాలకి అనుకున్నంత సక్సెస్ ఉండదు. అది ఎందుకో అందరికి తెలుసు.
అందువల్ల ఈ లిస్ట్‌లో ప్రభాస్, రజనీకాంత్ పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు “ప్రభాస్, రజనీకాంత్ వ్యక్తిత్వం ఒకటే. వీళ్లు ఎవరికి చెడు కోరుకోరు. అందుకే అన్ని భాషల ప్రేక్షకులు వీరి సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తూ, వీరిని అభిమానిస్తున్నారు” అని మాట్లాడుకుంటున్నారు. ఇక రజనీకాంత్ తాజాగా నటించిన కూలీ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తోంది. మొదటి రోజు 150.1 కోట్లు వసూలు చేసి, తమిళ సినీ చరిత్రలోనే “ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్” సాధించిన మూవిగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం రజనీకాంత్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.