
దక్షిణాది భాషలతో పాటు హిందీ సినిమాలో సైతం నటించి పాన్ ఇండియా నటిగా కీర్తి సురేష్ గుర్తింపును సంపాదించుకున్నారు. మహానటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కీర్తి సురేష్ ఈ సినిమా తర్వాత ఎక్కువ సంఖ్యలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించినా ఆ సినిమాలు ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేదు. పెళ్లి తర్వాత కూడా కీర్తి సురేష్ పలు ప్రాజెక్ట్స్ లో నటించిన సంగతి తెలిసిందే.
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు సంబంధించిన యాడ్ లో సైతం కీర్తి సురేష్ మెరిశారు. కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తున్న కీర్తి సురేష్ సరైన నిర్ణయాలు తీసుకుంటే సంచలనాలు క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటున్న కీర్తి సురేష్ బరువు తగ్గి లుక్స్ విషయంలో విమర్శలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కార్డియో వ్యాయామాలు చేసి తాను బరువు తగ్గానని కీర్తి సురేష్ చెబుతున్నారు. వారానికి 300 నిముషాలు వ్యాయామం చేయడం ద్వారా ఏకంగా 9 కిలోల బరువు తగ్గానని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. ఆహార కట్టుబాట్లు, తీవ్ర ప్రయత్నాల ద్వారా బరువు తగ్గడం కష్టం కాదని ప్రస్తుతం తాను కొత్త కథలను వింటున్నానని త్వరలోనే ఆ ప్రాజెక్ట్స్ వివరాలను ప్రకటిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. కీర్తి సురేష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్యా అంతకంతకూ పెరుగుతోంది.