కూలీ సినిమా విడుదల కాకముందు ఇందులో అమీర్ ఖాన్ నటించిన క్యామియో పాత్ర మీద భారీ అంచనాలు ఉండేవి. దాహా పాత్రలో తన విశ్వరూపాన్ని చూపించబోతున్నారని అభిమానులు చాలా గట్టిగానే నమ్మారు. ముఖ్యంగా విక్రమ్ చిత్రంలో సూర్య నటించిన రోలెక్స్ పాత్రకు మించి ఇందులో అమీర్ ఖాన్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంటూ చిత్ర బృందం చాలానే హైప్ ఇచ్చింది. తీరా డైరెక్టర్ లోకేష్ కనకరాజు కూలీ పాత్రలో అమీర్ ఖాన్ పాత్రని మాఫియా డాన్ పాత్రలో చూపించి హీరో దగ్గరికి వచ్చి సిల్లీ జోకులు వేయడం బీడీ అంటించి బిల్డప్ ఇవ్వడం తప్ప ఏమీ కనిపించడం లేదని కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్.


అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. రోలెక్స్ పాత్రతో పోలిక తెచ్చినప్పటికీ కానీ అందుకు రివర్స్ లో దాహా పాత్రని కామెడీ పాత్రలో చూపించాలనుకున్నప్పటికీ ఐడియా మిస్ ఫైర్ అయినట్టుగా కనిపిస్తోంది. వేలకోట్ల దందా చేసే ఒక డాన్ ఇంత సిల్లీగా కనిపించడం చూపించడమే కాకుండా దేవా కళ్ళు ఎదుటే ఉంటే మాత్రం ఎందుకు హత్య చేయడో అర్థం కాదు అంటూ నెటిజెన్స్ తెలుపుతున్నారు.. కనీసం విక్రమ్ చిత్రంలో రౌడీల గుంపులో కమలహాసన్ లా కలిసిపోయి చూపించినట్లుగా చూపించిన దాహా పాత్రకి న్యాయం జరిగేదని అభిమానులు భావిస్తున్నారు.


కానీ ఇక్కడ అంతా ఓపెన్ గా చూపించారు. దీంతో ఈ ఎపిసోడ్ పెద్దగా ఆకట్టుకోలేదని.. రజనీకాంత్ ,ఉపేంద్ర, అమీర్ ఖాన్ ముగ్గురు కలిసి పొగ తాగే సన్నివేశం ఉన్నప్పటికీ అది సోసో గానే అనిపించింది. మొత్తానికి అమీర్ ఖాన్ పాత్ర మాత్రం కూలీ సినిమాలో తేడా కొట్టిందని చెప్పవచ్చు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే రోలెక్స్ పాత్రను మించిపోయేలా మరొక పాత్ర సృష్టించడం డైరెక్టర్ లోకేష్ కనకరాజు వల్లే కాలేదని ఇప్పుడు క్లారిటీగా అర్థమయిపోతోంది. రోలెక్స్ పాత్రకు సంబంధించి ఫుల్ లెన్త్ క్యారెక్టర్ తీస్తానని లోకేష్ కనకరాజు చెప్పినప్పటికీ ఆ మాటను త్వరగా నిలబెట్టుకోవాలని సూర్య అభిమానులు కూడా తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: