తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్న వారిలో అనసూయ ఒకరు. అనసూయ కెరియర్ ప్రారంభంలో ఓ ప్రముఖ చానల్లో న్యూస్ రీడర్ గా పని చేసింది ఆ తర్వాత ఈమె ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. ఈ షో మంచి సక్సెస్ కావడం , అలాగే ఈ షో లో ఈమె తన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు ఈ షో ద్వారా అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అనసూయ కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాలు చాలా వరకు మంచి విజయాలను అందుకున్నాయి.

దానితో ఈమెకు నటిగా కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈమె చాలా కాలం పాటు ఓ వైపు టీవీ షో లలో నటిస్తూ మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చింది. మధ్యలో ఈమె కొంత కాలం కేవలం సినిమాలపై ఫోకస్ పెట్టిన మళ్లీ ఈమె తిరిగి ప్రస్తుతం ఓ వైపు టీవీ షో లతో , మరో వైపు  సినిమాలతో అద్భుతమైన రీతిలో బిజీగా కేరిర్ ను కొనసాగిస్తుంది. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా ఈమె తన తదుపరి మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్పింది. తాజాగా అనసూయ మాట్లాడుతూ ... పూరి జగన్నాథ్ తనయుడు అయినటువంటి ఆకాష్ పూరి హీరో గా రూపొందబోయే ఓ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు ఈమె చెప్పుకొచ్చింది.

ఇకపోతే ఇప్పటివరకు అనసూయ అనేక సినిమాల్లో నటించింది. కానీ ఈమెకు కొన్ని సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపు వచ్చింది. కెరియర్ ప్రారంభంలో ఈమె క్షణం సినిమాలో నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. అలాగే రంగస్థలం సినిమాలోని ఈమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే పుష్ప సినిమాలోని ఈమె పాత్రకు కూడా మంచి గుర్తింపు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: