డ్రింకర్ సాయి,సిందూరం వంటి సినిమాల్లో నటించిన ధర్మ మహేష్ గురించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అది కూడా ఆయన భార్య పలు యూట్యూబ్ ఛానల్స్ కి, మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ధర్మ మహేష్ నిజస్వరూపం మొత్తం బయటపెడుతోంది. ముఖ్యంగా తనకు విడాకులు కావాలని ఇంకా తనని భరించడం నా వల్ల కాదు అంటూ చెప్పుకొస్తుంది. అయితే తాజాగా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.. ధర్మ మహేష్ కనిపించేంత మంచివాడు కాదు. ఆయన సినిమాల్లోనే హీరోగా మీకు కనిపిస్తారు. కానీ ఆయన బయట పెద్ద విలన్ ఎంతోమంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు.

నేను ప్రెగ్నెంట్ గా ఉన్న టైం లో చాలామంది అమ్మాయిలతో అర్ధరాత్రి వరకు ఎంజాయ్ చేసి వచ్చేవాడు. కొడుకు పుట్టాక కూడా నన్ను అనుమానించి టార్చర్ చేశాడు. వేరే వాళ్ళతో తిరిగితే అడిగినందుకు మరింత టార్చర్ చేస్తున్నాడు. ధర్మ మహేష్ ఆయన సోదరీ ఇద్దరు కలిసి నన్ను అదనపు కట్నం కావాలి అని వేధిస్తున్నారు. నా సంపాదన ఆస్తిపాస్తులు అన్ని కావాలి.కానీ నన్ను మాత్రం పక్కన పెడుతున్నారు. ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలో నన్ను చంపేయాలని అనుకున్నాడు. కానీ అది కుదరలేదు.

అలాగే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినందుకు నన్ను మా ఫ్యామిలీని చంపేస్తానని బెదిరిస్తున్నాడు.ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో హాజరు కాలేదు. ఎన్నిసార్లు పిలిచినా కూడా రావట్లేదు. అందుకే ఇక భరించడం నావల్ల కాదు.. అందుకే ఇలా మీడియా ఛానల్స్ కి ఆయన గురించి సమాచారం ఇస్తున్నాను. నాకు విడాకులు ఇవ్వకపోతే ఆయన గురించి మరిన్ని విషయాలు బయటపెడుతూనే ఉంటాను. ఆయన ఫ్లాట్ కి చాలామంది బిగ్ బాస్ కి వెళ్లిన అమ్మాయిలు కూడా వస్తూ ఉంటారు. ఇదేంటి అని అడిగితే నన్ను కొడతాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది గౌతమి

మరింత సమాచారం తెలుసుకోండి: