ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రౌడీ షీటర్ శ్రీకాంత్ , అతని ప్రేయసి అరుణ కి సంబంధించిన టాపిక్ ఎంతో వైరల్ గా మారింది. గత కొంత కాలం గా రౌడీ షీటర్ శ్రీకాంత్ చేస్తున్న అనేక వ్యవహారాలలో తన ప్రేయసి అయినటువంటి అరుణ జోక్యం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ ఏదైనా డీల్ ఒప్పుకున్నాడు అంటే అరుణ అందులోకి ఎంట్రీ ఇచ్చి అతనికి సంబంధించిన వ్యవహారాలన్నిటిని దాదాపుగా ఆమె చక్క పెట్టేది అని , ఆమె ఎవరితో ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేసి మ్యాటర్ ని చాలా సింపుల్గా ముగించేది అని తెలుస్తుంది. తాజాగా ఈమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈమె సెల్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈమె అనేక మంది రాజకీయ నాయకులతో , పోలీస్ అధికారులతో ఎంతో చనువుగా మాట్లాడిన ఫోన్ రికార్డింగ్స్ తన ఫోన్లో ఉన్నాయి అని తెలుస్తుంది. అలాగే కొన్నింటిని డిలీట్ కూడా చేసినట్లు తెలుస్తోంది. అలా డిలీట్ చేసిన వాటిని కూడా తిరిగి పోలీసులు తిరిగి రీ స్టోర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దానితో అనేక మంది జనాలు అరుణ ఎవరెవరితో ఎలాంటి సంభాషణలు చేసి ఉంటుంది. ఎలాంటి డీల్స్ చేసి ఉంటుంది.

ఈమెతో మాట్లాడిన దాంట్లో ఎలాంటి వ్యక్తులు బయటపడతారు. ఎవరి పేర్లు బయటకు వస్తాయి అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి అరుణ డీల్ చేసిన వ్యక్తుల్లో ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా ..? పోలీస్ అధికారులు ఉన్నారా ..? మరి ఎవరైనా ఫేమస్ వ్యక్తులు ఉన్నారా అనేది చూడాలి. ఏదేమైనా కూడా చాలా మంది జనాలు అరుణ మాట్లాడిన ఫోన్ సంభాషణలు అన్ని బయటకు వచ్చినట్లయితే ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తుల పేర్లు బయటకు వస్తాయి అని అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: