ఈ మధ్యకాలంలో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ చేసిన ప్రతి పని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. ఆయన పేరు ఎక్కడ వినిపించినా, అక్కడి నుంచి మీమ్స్, ట్రోల్స్, డిబేట్స్ అన్నీ వెంటనే మొదలవుతున్నాయి. ప్రత్యేకంగా రీసెంట్ గా విడుదలైన "ఓజి" సినిమా నుంచి వచ్చిన “సువ్వి సువ్వి” పాట విషయంలో పరిస్థితి మరింత హాట్ టాపిక్ అయిపోయింది. సుజీత్ దర్శకత్వంలో, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “ఓజి”పై ప్రేక్షకుల్లో అద్భుతమైన క్రేజ్ నెలకొంది. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాలో అటు ఫ్యాన్స్, ఇటు నెట్‌జన్లలో హంగామా రేపుతోంది.
 

ఇక వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన “సువ్వి సువ్వి” సాంగ్ మొదటి క్షణం నుంచే మెలోడీయస్ ట్యూన్‌తో ఆకట్టుకుని, ఫ్యాన్స్‌కి మంత్ర ముగ్ధులను చేసింది. పాట విన్న వెంటనే “సూపర్ మెలోడీ”, “థమన్ ఈసారి అందరినీ ఆశ్చర్యపరిచాడు” అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ప్రమోట్ చేశారు. అయితే, ఈ పాట హిట్ అవుతుందనుకున్న తరుణంలోనే కొత్త వివాదం మొదలైంది. సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు ఈ పాట హీరో నందు నటించిన "సవారి" సినిమాలోని “ఉండిపోవా నువ్విలా రెండు కళ్ల లోపల” అనే పాటతో బాగా సింక్ అవుతోందని చెబుతున్నారు. కేవలం ట్యూన్ మాత్రమే కాదు, మ్యూజిక్ ప్యాటర్న్స్, బ్యాక్‌గ్రౌండ్ హమ్ కూడా దాదాపు అదే తరహాలో ఉన్నాయంటూ కంపారిజన్ వీడియోలు షేర్ చేస్తున్నారు. దీంతో “థమన్ మళ్లీ కాపీ కొట్టాడు”, “అసలు క్రియేటివిటీ ఏమీలేదా?” అంటూ ట్రోల్స్ హద్దులు మీరుతున్నాయి.



ఇక ఇది ఒక్కసారే కాదు, గతంలో కూడా థమన్ అనేక సార్లు ఇలాంటి కాపీ కాంట్రవర్సీల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆయన మ్యూజిక్‌లో కొంతమంది ఫ్యాన్స్ ఎనర్జీ, మాస్ వైబ్రేషన్ ఉన్నాయని చెబుతుంటే, మరోవైపు చాలామంది మాత్రం “అన్నీ కాపీ వర్క్, ఒరిజినల్ మ్యూజిక్ ఏమీ ఉండదు” అని తీవ్రంగా విమర్శిస్తారు. ఇప్పుడు సువ్వి సువ్వి వివాదం మళ్లీ ఆయనను సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడేసింది. ఇక కొందరు సినీ విశ్లేషకులు కూడా దీని గురించి తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. “తమన్ ఈ విమర్శలను లైట్‌గా తీసుకుంటే ఫ్యూచర్‌లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా తన స్థాయిని నిలబెట్టుకోవాలంటే ఇకనైనా కొత్త ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలి, క్రియేటివ్‌గా ఆలోచించాలి” అని చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. “రాజాసాబ్ సినిమా నుంచి ఆయనను తొలగించాలి” అనే హాష్‌ట్యాగ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి దీని పైనే ఉంది. ఈ కాపీ వివాదంపై థమన్ ఎలా స్పందిస్తాడు? ఆయన కౌంటర్ ఇస్తాడా? లేక ఎప్పటిలాగే మౌనం వహిస్తాడా? అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: