అనుష్క శెట్టి పవర్ ఫుల్ శీలావతి పాత్రలో నటించిన తాజా మూవీ ఘాటి.. ఈ సినిమా ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోస్ పడిపోయాయి.ఇక ఈ ప్రీమియర్ షోస్ చూసిన చాలామంది నెటిజన్లు అనుష్క పై పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు ట్విట్టర్ షేక్ అయ్యేలా అనుష్క ఘాటి గురించి పోస్టులు పెట్టడంతో  చాలామంది ఈ సినిమా బాగుందని మాట్లాడుకుంటున్నారు. ఇక ఘాటి మూవీలో అనుష్క కాటేరమ్మ లాగే తన మాస్ యాక్టింగ్ తో కుమ్మేసిందని,చాలా రోజుల తర్వాత అరుంధతి లాంటి సినిమా అనుష్క చేసింది అంటూ ఇలా ఎంతోమంది పోస్టులు పెడుతున్నారు.ఇక మరికొంతమంది ఏమో సినిమా వేరే లెవెల్ ఉంది అని అంటే ఇంకొంతమంది సినిమా స్టోరీ ఊహించే విధంగా ఉందని.. అక్కడక్కడ కొన్ని సీన్స్ బోరింగ్ గా ఉన్నాయి అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా అనుష్కకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది.ఘాటీ మూవీ ప్రమోషన్స్ లో అనుష్క ఎక్కువగా పాల్గొనక పోయినప్పటికీ కొన్ని ప్రెస్ మీట్ లో మాత్రం పాల్గొంది.అలా ఘాటి మూవీ కోసం అనుష్క పాల్గొన్న ఓ విలేకరుల సమావేశంలో తన డ్రీమ్ రోల్ గురించి చెప్పుకొచ్చింది. మీకు ఎలాంటి సినిమాల్లో నటించాలని ఉంది అని ఓ విలేకరి అనుష్కని ప్రశ్న అడగగా.. నాకు బలమైన విలనిజం చూపించే పాత్రలో నటించాలని ఉంది.అలాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ వస్తే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడానికి రెడీగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. అలా అనుష్క డ్రీమ్ రోల్ ఒక పవర్ఫుల్ నెగిటివ్ రోల్ లో నటించడం అని తెలుస్తోంది.

అయితే అనుష్క డ్రీమ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం ఓకే గాని ఇలాంటి పాత్ర అనుష్కకి వస్తుందా అనేదే అభిమానుల్లో ఉన్న ప్రశ్న..ఎందుకంటే అనుష్కని నెగిటివ్ పాత్రలో విలన్ గా ఎవరూ ఊహించుకోలేరు.ఆమెను హీరోయిన్ గానే ఊహించుకుంటారు. అలాంటిది అనుష్క కోసం స్పెషల్ గా నెగిటివ్ పాత్ర లో చూపించే డైరెక్టర్ ఉంటారా అనేది చూడాలి.. అయితే అభిమానులు మాత్రం అనుష్కని నెగిటివ్ షెడ్స్ ఉన్న రోల్ లో చూడడానికి ఆసక్తిగా ఉన్నామంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే నటీనటులు అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ని పోషించగలిగాలి. అలా అనుష్క హీరోయిన్ గానే కాదు విలన్ గా నటిస్తే కూడా చూడాలని ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.మరి అనుష్కకు నెగటివ్ షేడ్స్ పోషించే పాత్ర వస్తుందా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: