యంగ్ హీరో గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నటులలో తేజ సజ్జా ఒకరు.. హనుమాన్ మూవీలో సూపర్ మాన్ పాత్రతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హైలైట్ అయ్యారు తేజ.అయితే ఈ సినిమా కంటే ముందే జాంబిరెడ్డి, అద్భుతం వంటి సినిమాలు చేసిన తేజ కెరియర్ మాత్రం హనుమాన్ మూవీ మార్చేసింది అని చెప్పుకోవచ్చు.ఇక తేజ సజ్జా తన బాల్యంలోనే ఎన్నో హిట్ సినిమాలు చేశారు.ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించారు.అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన తేజబేబీ అనే సినిమాతో టాలీవుడ్లోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చారు.ఓ బేబీ సినిమాలో ముఖ్యపాత్ర పోషించినప్పటికీ జాంబి రెడ్డి సినిమాతో హీరోగా మారారు. అయితే అలాంటి తేజ సజ్జా నటిస్తున్న తాజా మూవీ మిరాయ్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ విషయాన్ని పంచుకున్నారు తేజా. 

అయితే ఐఫా అవార్డ్స్ లో రానాతో కలిసి తేజ స్టార్ హీరోలపై కొన్ని సెటైర్లు, జోకులు వేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆ సమయంలో ఎంతో మంది హీరోల అభిమానులు ఒక్క సినిమా హిట్ కే తేజాకు పొగరు పెరిగిపోయింది.స్టార్ హీరోలు అన్న గౌరవం లేకుండా వాళ్ళపై ఎలాంటి సెటైర్లు వేస్తున్నారో చూడండి అంటూ నెగిటివ్ కామెంట్స్ చేశారు. అంతే కాదు కొంతమంది హీరోల అభిమానులు అయితే తేజ మాట్లాడిన మాటలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఈ నెగిటివిటీపై తాజాగా మిరాయ్ మూవీ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. బాలకృష్ణ చిరంజీవి వెంకటేష్ సార్ ల మీద జోకులు వాళ్ళ పర్మిషన్ లేకుండా వేయలేదు . ఈ ఐఫా అవార్డ్స్ వేడుకల్లో ఎలా మాట్లాడాలి అని ముందుగానే స్క్రిప్ట్ రాసుకున్నాము. ఆ టైంలో వెంకీ సార్ నా దగ్గరికి వచ్చి నా మీద అలా జోక్ వెయ్యరా సరదాగా ఉంటుందని ఆయనే వచ్చి చెప్పారు. 

అలాగే బాలకృష్ణ, చిరంజీవి సార్ ల అనుమతి తీసుకోకుండా వాళ్ళ మీద జోకులు పేల్చగలమా.. ఈ విషయాన్ని ఆడియన్స్ కొంచెం తెలుసుకుంటే బాగుండు. అయినా కూడా ఇలా అందరూ గుర్తించే స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటివి మాట్లాడకపోతేనే బాగుంటుంది. ఇప్పటినుండి ఇలాంటివి మానేయడం మంచిది అన్నట్లుగా తేజ సజ్జా చెప్పుకొచ్చారు.అయితే తేజ సజ్జా మాట్లాడిందాంట్లో చాలా క్లియర్ గా అర్థమైంది ఏంటంటే.. స్టార్ హీరోల పర్మిషన్ తీసుకొనే వాళ్ళ మీద జోకులు పేల్చారు అనేది. కానీ ఈ విషయం తెలియని కొంతమంది హీరోల అభిమానులు ఆయనపై నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు. ఈ విషయంలో బాధపడ్డ తేజ ఈ విధంగా తన మిరాయ్ మూవీ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: