
అయితే, రష్మిక తన కెరీర్‌లో ఎక్కువసార్లు రిజెక్ట్ చేసిన హీరో గురించి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ హీరో మరెవరో కాదు—నేచురల్ స్టార్ నాని. నానితో ఆమె ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు సినిమాలు మిస్ చేసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. మొదట వీరి కాంబినేషన్‌లో రావాల్సిన సినిమా "శ్యామ్ సింగరాయ్". వరుస ఫ్లాప్స్ తో సతమత మవుతున్న నాని కి బిగ్ సక్సెస్ ఇచ్చిన మూవీ.
ఈ సినిమాలో కృతి శెట్టి పోషించిన పాత్రకు ముందుగా రష్మికను అనుకున్నారట. కానీ అప్పటికే ఆమె వేరే సినిమాలో బిజీగా ఉండటంతో ఈ సినిమాను వదిలేసిందట. తర్వాత వీరిద్దరికీ కలిసి రావాల్సిన సినిమా "దసరా". కీర్తి సురేష్ పోషించిన పాత్రకు రష్మికను ముందుగా అనుకున్నారట. కానీ డీ గ్లామరస్ లుక్‌లో ఈ పాత్రలో కనిపిస్తే నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుందనే కారణంతో ఆమె తిరస్కరించింది. అప్పటికే పుష్ప లో డీ గ్లామరస్ లుక్ లో కనిపించిన కారణంగా వదిలేసిందట. వీళ్ళ కాంబోలో మిస్ అయిన మూడో సినిమా ఇటీవలి కాలంలో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రం "హిట్". ఈ సినిమాలో కూడా హీరోయిన్‌గా రష్మికనే అనుకున్నారు. కానీ పుష్ప 2 తర్వాత ఆమె క్రేజ్ పెరగడం, రెమ్యూనరేషన్ తేడా కారణంగా ఈ సినిమాను కూడా వదిలేసిందట. ఈ మూడు సినిమాలను వరుసగా రిజెక్ట్ చేయడంతో రష్మిక, నాని కాంబో సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా ట్రెండ్ అవుతోంది. కొంత మంది నాని అంటే ఎందుకు అంత చిన్న చూపు అని రష్మిక ని ట్రోల్ చేస్తున్నారు. అయితే వీళ్ల కాంబోలో ఓ సినిమా వచ్చింది. అదే "దేవదాస్". నాని-రష్మిక ల జంట సూపర్ అనిపించింది. కానీ సినిమా హిట్ అవ్వలేదు. ఇదే విషయాని ట్రోలర్స్ కి ఘాటు గా అర్ధం అయ్యేలా గుర్తు చేస్తున్నారు జనాలు. వీళ్ళ కాంబోలో ఫస్ట్ వచ్చిన సినిమా కూడా ఇదే. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ టైంలో నాని ని ఐరెన్ లెగ్ అంటూ ట్రోల్ చేశారు జనాలు. ఆ కారణంగా భయపడి తనతో నెక్స్ట్ మూవీస్ ని రిజెక్ట్ చేసి ఉండచ్చు అంటూ కొంతమంది ఘాటుగా మాట్లాడుకుంటున్నారు..!!