కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన హీరో శింబు సినిమాలలో కంటే ఎక్కువగా వివాదాల వల్లే తన పేరు వైరల్ గా మారింది. గత కొంతకాలంగా తనని తాను నిరూపించుకోవడానికి వరుస ప్రయత్నాలు చేస్తూ ట్రాక్ లోకి వచ్చారు శింబు . పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించారు. ప్రస్తుతం శింబు తన 49వ సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యారు. ఈ చిత్రానికి డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా స్టోరీ కూడా ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగేటువంటి ఒక గ్యాంగ్ స్టర్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు.


ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సమయంలో ఈ చిత్రంలో హీరోయిన్గా మొదట పూజా హెగ్డే అని అనుకున్నారట. కానీ కొన్ని కారణాల చేత హీరోయిన్ సాయి పల్లవిని సంప్రదించినట్లు సమాచారం.. అయితే కథ విన్న తర్వాత సాయి పల్లవి మొదట ఈ చిత్రంలో నటించడానికి పాజిటివ్ గానే స్పందించిందట. ఇందులో హీరోగా శింబు అని ముందుగానే చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఎందుకో తెలియదు కానీ  సాయి పల్లవి ఆ ప్రాజెక్టులో నటించలేనంటూ చెప్పేసినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.


ఇందుకు ముఖ్య కారణం హీరో శింబు అని ప్రచారమైతే కోలీవుడ్లో జరుగుతోంది. డైరెక్టర్ వెట్రిమారన్ వంటి డైరెక్టర్ తో సినిమా చేయడానికి చాలామంది ఇష్టపడతారు.. ఇలాంటి డైరెక్టర్ తో తనకి అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తానని సాయి పల్లవి కూడా గతంలో బహిరంగంగానే చెప్పింది. అయితే ఇప్పుడు ఈ హీరో కారణంగానే ఈ ప్రాజెక్టును వదులుకున్నట్లు వినిపిస్తున్నాయి. మరి హీరో శింబు వల్ల సాయి పల్లవి వెట్రిమారన్ సినిమాకి నో చెప్పిందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బాలీవుడ్లో రామాయణం అనే సినిమాలో నటిస్తోంది. తెలుగులో ఏ సినిమాలో నటించలేదు. కానీ కోలీవుడ్లో నటిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: