ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో అల్లు అర్జున్ పేరు అనేక రకాలుగా చర్చలకు, ట్రోలింగ్‌కి గురైన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ‘పుష్ప’ సినిమా తర్వాత ఆయన పేరు సోషల్ మీడియాలో విపరీతమైన స్థాయిలో వైరల్ అయింది. సినిమా ప్రీమియర్స్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన దురదృష్టకర సంఘటనలో ఓ మహిళ మృతి చెందడం అల్లు అర్జున్ కెరీర్‌కు పెద్ద షాక్‌లా మారింది. ఆ సంఘటనపై ఆయన ప్రవర్తన, ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు చాలా మందికి నెగిటివ్‌గా అనిపించడంతో ఆయన కెరీర్‌పై కొంతవరకు ప్రతికూల ప్రభావం పడింది అని సినీ వర్గాలు పేర్కొన్నాయి.


అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసి ఒక రాత్రి జైలులో ఉంచడం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశమైంది. ఈ సంఘటనలు ఆయనపై నెగిటివ్ ఇమేజ్‌ను మరింత పెంచాయి. అయితే, ఇటీవలి కాలంలో అల్లు అర్జున్ ఈ చేదు జ్ఞాపకాల నుండి బయటపడి మళ్లీ పాజిటివ్ వైపునకు అడుగులు వేస్తున్నారు. ఆయన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీతో గడిపే సమయాలు, తన సింప్లిసిటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల మనసు గెలుచుకుంటున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ - అట్లీ  దర్శకత్వంలో ఒక భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ముంబైలో కీలక షెడ్యూల్ జరుపుకుంటుండగా, ఆయన నానమ్మగారి మరణం కారణంగా షెడ్యూల్‌ను వదిలి వెంటనే హైదరాబాద్‌కు చేరుకుని కుటుంబంతో కలిసి అంత్యక్రియలకు హాజరై అన్ని కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సంఘటన ఆయన ఫ్యామిలీ విలువలను మళ్లీ ఒకసారి చాటిచెప్పింది.



ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన తదుపరి షెడ్యూల్ అబుదాబిలోని లివా ఒయాసిస్ ప్రాంతంలో ప్లాన్ చేసినట్లు మూవీ మేకర్స్ తెలుస్తుంది. ఈ షెడ్యూల్‌లో భారీ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడమే కాకుండా ఒక ప్రత్యేకమైన రొమాంటిక్ సాంగ్‌ను కూడా అక్కడే షూట్ చేయనున్నారట. ఈ సాంగ్ చిత్రీకరణకు హీరోయిన్ దీపికా పదుకొణే కూడా జాయిన్ కానున్నారని సమాచారం. సుమారు ₹600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లివా ఒయాసిస్‌లో తెరకెక్కించే ఈ పాట అత్యంత రొమాంటిక్‌గా, క్లాసీగా ఉంటుందని సినిమా టీమ్ చెబుతోంది. అల్లు అర్జున్ ఇప్పటివరకు ఇలాంటి రొమాంటిక్ సాంగ్‌లో నటించడం ఇదే మొదటిసారి అని కూడా మేకర్స్ వెల్లడించారు.



అయితే, ఈ సమాచారం సోషల్ మీడియాలో బయటపడిన వెంటనే నెటిజన్లు తమదైన రీతిలో స్పందించడం ప్రారంభించారు. "ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్ మీద నెగిటివ్ కామెంట్లు తగ్గి పాజిటివ్ వాతావరణం ఏర్పడుతోంది, మెగా ఫ్యామిలీతో కలుస్తున్నారు. ఇలాంటి సమయంలో రొమాంటిక్ సాంగ్‌లు ఎక్కువగా చేయడం వల్ల మళ్లీ ట్రోలింగ్ మొదలవుతుందేమో", "స్నేహా రెడ్డి మనసు నొచ్చేలా చేయొద్దు", "ఎమటీ అట్లీ..బన్నీ-స్నేహల  మధ్య చిచ్చు పెడుతున్నావ్" అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ భారీ చిత్రంలో రష్మిక మందన్నా, జాన్వి కపూర్, రుణాల్ ఠాకూర్ వంటి టాలెంటెడ్ నటీమణులు కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.



సన్ నెట్‌వర్క్ యజమాని కళానిధి మారన్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ భారత సినిమాల చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ సినిమాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని టాక్. బన్నీ తన కెరీర్‌లో మరింత స్థాయికి వెళ్లేలా ఈ సినిమా సహాయపడుతుందని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: