తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో నితిన్ ఒకరు. నితిన్ ఇప్పటివరకు చాలా సినిమాలలో హీరో గా నటించాడు. అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను కూడా అందుకున్నాడు. ఇకపోతే నితిన్ కు ఆఖరికి విజయం దక్కి మాత్రం చాలా కాలమే అవుతుంది. ఈయన నటించిన చాలా సినిమాలు వరుస పెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాలను ఎదుర్కొంటున్నాయి. కొంత కాలం క్రితం నితిన్ "మాచర్ల నియోజకవర్గం" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

ఆ తర్వాత నితిన్ హీరో గా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ , రాబిన్ హుడ్ తాజాగా హీరో గా నటించిన తమ్ముడు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ లుగా నిలిచాయి. ఇలా వరుస పెట్టి భారీ ఫ్లాప్స్ రావడంతో నితిన్ కెరియర్ చాలా వరకు డౌన్ ఫాల్ అయింది. ఇలా వరుస ఆపజయాలు రావడంతో నితిన్ దగ్గర నుండి ఏకంగా రెండు సినిమాలు చెజారినట్లు వార్తలు వస్తున్నాయి.

అసలు విషయం లోకి వెళితే ... కొంత కాలం క్రితం వరకు నితిన్ , బలగం వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మాణంలో ఎల్లమ్మ అనే సినిమాలో నటించనున్నట్లు  , అలాగే విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మరో మూవీ లో నటించనున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇకపోతే ఎల్లమ్మ మూవీ లో నితిన్ కాకుండా శర్వానంద్ హీరో గా ఫైనల్ అయినట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. అలాగే విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందే సినిమా కూడా నితిన్ నుండి చేజారిపోయినట్లు తెలుస్తోంది. ఇలా నితిన్ నుండి రెండు సినిమాలు దూరం అయినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: