గ‌త వారం భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన `మిరాయ్‌` సూప‌ర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ మూవీతో హీరో తేజ స‌జ్జా మ‌రో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. మ‌రోవైపు మంచు మ‌నోజ్ కూడా మిరాయ్ ద్వారా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. మహాబీర్ లామా పాత్రలో మంచు మనోజ్ అద‌ర‌గొట్టేశాడు. తన బాడీ లాంగ్వేజ్, యాంగ్రీ లుక్స్, యాక్షన్ సీన్స్‌తో పూర్తిగా కొత్తగా కనిపించారు.


అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. మిరాయ్‌లో విల‌న్ క్యారెక్ట‌ర్ కు ఫ‌స్ట్ ఛాయిస్ మ‌నోజ్ కాదు. మొద‌ట మ‌రొక టాలీవుడ్ హీరోను సంప్ర‌దించ‌గా.. అత‌ను నో చెప్పాడ‌ట‌. ఇంత‌కీ ఆ అన్‌ల‌క్కీ హీరో మ‌రెవ‌రో కాదు సందీప్ కిష‌న్. మ‌నోజ్ పోషించిన మహాబీర్ లామా క్యారెక్ట‌ర్ ను డైరెక్ట‌ర్ కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ముందుగా సందీప్‌ను ఆఫ‌ర్ చేయ‌డం జ‌రిగింది. తేజ సజ్జాతో పాటుగా సందీప్ కిషన్ కు కూడా మిరాయ్ స్టోరీని కార్తీక్ నెరేట్ చేశాడు.


అయితే క‌థ న‌చ్చిన‌ప్ప‌టికీ అప్పటికే ఉన్న కమిట్మెంట్స్ కారణంగా సందీప్ కిషన్ మిరాయ్‌ను సున్నితంగా రిజెక్ట్ చేశాడు. దాంతో ఆ ఆఫ‌ర్ మంచు మ‌నోజ్‌ను వ‌రించింది. మిరాయ్ సూప‌ర్ హిట్ కావ‌డంతో లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌నోజ్ కెరీర్ మ‌ళ్లీ ఊపందుకుంది. ప్ర‌స్తుతం మ‌నోజ్‌కు అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. కాగా, రికార్డ్ ఒపెనింగ్స్ తో బాక్సాఫీస్ ర‌న్ ను ప్రారంభించిన మిరాయ్‌.. వీకెండ్‌కే బ్రేక్ ఈవెన్ సాధించింది లాభాల బాట ప‌ట్టింది. 100 కోట్ల మార్క్ ను సుల‌భంగా చేరుకుని ఫుల్ స్టడీగా ముందుకు సాగుతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: